Begin typing your search above and press return to search.
అమరావతి భూముల కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 22 July 2021 11:30 AM GMTకొన్ని అంశాల్లో ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం.. చకచకా ఆదేశాలు జారీ కావటం.. అనంతరం దాని మీద వెనక్కి తగ్గటం లాంటివి ఏపీలోని జగన్ సర్కారులో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. అమరాతి భూములపై జగన్ సర్కారు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.
అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్న వేళలో.. కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అమరావతి భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది జగన్ సర్కారు. రాజధాని ప్రకటన నేపథ్యంలో భూములకు సంబంధించి ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లుగా ఆరోపిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో అప్పీల్ కు వెళ్లిన ఏపీ సర్కారుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలోనూ చుక్కెదురైంది.
ఏపీ ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా చోటు చేసుకున్న తాజా పరిణామంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక.. ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజధాని ప్రాంతానికి సంబంధించిన ముందస్తు సమాచారంతో భూముల్ని కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుపై స్టే విధిస్తూ హైకోర్టు గాగ్ ఉత్తర్వుల్ని జారీ చేసింది. తాను అనుకున్న దానికి భిన్నంగా సుప్రీంలో ప్రతికూల తీర్పురావటంతో అప్పీల్ ను వెనక్కి తీసుకుంటూ ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇటీవల కాలంలో పలు అంశాల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారుల్లో లోపించిన ముందుచూపు.. న్యాయనిపుణుల సలహాల్ని తీసుకునే విషయంలో జరుగుతున్న తప్పులు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాలపై జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.