Begin typing your search above and press return to search.

యాపిల్ కు వరుస షాక్ లు.. జపాన్ సైతం షాకిచ్చింది..

By:  Tupaki Desk   |   29 Dec 2022 11:30 AM GMT
యాపిల్ కు వరుస షాక్ లు.. జపాన్ సైతం షాకిచ్చింది..
X
అంతర్జాతీయ ఫోన్ల తయారీ కంపెనీ 'యాపిల్'కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ఈ కంపెనీకి తాజాగా జపాన్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నవంబర్ లో బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ ఫోన్లను తమ దేశంలో స్వాధీనం చేసుకుంది.

ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వడాన్ని ఆపేసిన కంపెనీ తీరుపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా యాపిల్ తన ఫోన్లను రీసేల్ చేసే విషయంలో వినియోగపన్ను కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 98 మిలియన్ల డాలర్ల పెనాల్టీ విధించింది. దీంతో యాపిల్ కు మరో భారీ షాక్ ఇచ్చినట్లయింది.

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమైనా చేస్తాయి. తమను ధిక్కరించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవడానికి వాటికి అనేక మార్గాలుంటాయి. అవసరమైతే కోర్టులను ఉపయోగించుకొని మరీ సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి.

తాజాగా జపాన్ ప్రభుత్వం యాపిల్ కంపెనీకి షాక్ ఇచ్చింది. విదేశాల నుంచి జపాన్ కు వచ్చి వస్తువులను కొనుగోళ్లు చేసేవారికి జపాన్ ప్రభుత్వం 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. కానీ ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి రీసేల్ చేసేవారికి ఇది వర్తించదు. ఫస్ట్ సేల్స్ కు ట్యాక్స్ విధిస్తుంది.

ఈ క్రమంలో కొన్ని సంస్థలు వందల కొద్దీ ఐ ఫోన్, ఇతర ఫోన్లను కొనుగోలు చేసి ఇతరులకు రీసేల్ చేస్తుంది. అయితే ఈ సంస్థలు కంపెనీ నుంచి కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్ వస్తుంది. ఈ క్రమంలో వారు డిస్కౌంట్ ను మినహాయించుకొని తక్కువ రేటుకే ఇవే ఫోన్లను ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇలా కొందరు యాపిల్ ఫోన్లు కొనుగోళ్లు చేసి రీసేల్ చేసేవాళ్లు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఫోన్లను విక్రయించారు. దీంతో ఈ ఫోన్లను విక్రయించిన యాపిల్ కంపెనీపై నేరుగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.

జపాన్ దేశ చట్ట ప్రకారం కాస్మోటిక్స్, ఫార్మాలకు 3744 డాలర్ల సేల్స్ వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పరిధి దాటితే మాత్రం భారీగానే పన్ను ఉంటుంది. అయితే యాపిల్ ఫోన్లు రీసేల్ చేస్తున్న క్రమంలో ఆ పరిధి దాటింది. ఇందులో భాగంగా ట్యాక్స్ మొత్తాన్ని అంటే 98 మిలియన్ల డాలర్ల పన్నును కట్టాలని కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై యాపిల్ కోర్టుకు అప్పీల్ చేసుకుంది. ఆ తరువాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందో కంపెనీతో పాటు ప్రభుత్వం ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.