Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీతో గడిపిన క్షణాలు మర్చిపోలేను..!

By:  Tupaki Desk   |   18 March 2022 12:31 PM GMT
ప్రధాని మోడీతో గడిపిన క్షణాలు మర్చిపోలేను..!
X
టాలీవుడ్ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ''ది కాశ్మీర్ ఫైల్స్". నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని ప్రపంచంలోని హిందూ పండిట్ లకు.., ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...

- ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు.

- సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్ కు వచ్చి కలిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. 'నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు.. 32 ఏళ్ళ నుండి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది' అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది.

- అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. సుమారు 2 వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు.

- సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

- ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా? అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందనే ఫీలింగ్ ను వ్యక్తం చేశారు.

- ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం. మూడు నెలలపాటు యూఎస్ - కెనడా - దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.

- వివేక్ కథ చెప్పాకే నాకు సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. హిందీలో ఇది నా తొలి సినిమా. దీనికి సీక్వెల్ అనేది వుండదు

- ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్ల నుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు.

- అందుకే ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు వుంటే అది కశ్మీర్ పండితులకు చెల్లుతుంది. వారికే ఈ సినిమా అంకితం.

- ప్రధాని మోడీగారిని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను.

- ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకు ముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను.

- కరెక్ట్ గా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు.

- త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులో కూడా డబ్ చేయబోతున్నాం.

- మా సినిమాకు అస్సాం - యూపీ - గుజరాత్ - మధ్యప్రదేశ్ - హర్యానా - కర్నాటకతో సహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది.

- ఇంకా ఈ సినిమాలో చెప్పలేని కొన్ని విషయాలున్నాయి. ఏది ఏమైనా 370 ఆర్టికల్ వరకే సినిమా తీశాం. ఆ తర్వాత కంటిన్యూ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. ఈ సినిమా థియేటర్లో తర్వాత ఓటీటీలోకూడా విడుదలకాబోతుంది.

- ఈ సినిమాలో నాతోపాటు నా కుటుంబ సభ్యులు - స్టాఫ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. 24గంటలు వారు ఈ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు.

- ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రిపూటా ఆ పాత్రలో మమేకమై వారికి నిద్ర కూడా సరిగ్గా పట్టేదికాదు.

- షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్ కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటి దగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి.

- ప్రస్తుతం రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వర రావు' చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదే విధంగా దర్శకుడు వివేక్ తో 'ఢిల్లీ ఫైల్స్' అనే సినిమా ఆలోచనలో వుంది.