Begin typing your search above and press return to search.
శరత్ ను చంపిన హంతకుడ్ని ఎన్ కౌంటర్
By: Tupaki Desk | 16 July 2018 6:46 AM GMTతెలుగు ప్రజల్ని విషాదంలో నింపిన శరత్ ను హత్య చేసిన దుండగుడ్ని అమెరికా పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు. వరంగల్ కు చెందిన కొత్తవాడ వాసవీ కాలనీకి చెందిన కొప్పు శరత్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లటం తెలిసిందే. ఆర్నెల్ల క్రితం అమెరికాకు వెళ్లిన అతగాడు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీలో చదువుతూ.. రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
అయితే.. ఈ నెల 6న కేన్సస్ లోని శరత్ పని చేసే రెస్టారెంట్‌కు వచ్చిన ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ మరణించాడు. ఈ ఉదంతం అమెరికాలో తీవ్ర సంచలనాన్ని సృష్టించగా.. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారిని విషాదంలోకి నెట్టేసింది. ఇదిలా ఉండగా కొప్పు శరత్ ను హత్య చేసి పరారైన దుండగుడ్ని తాజాగా అమెరికా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
కేన్సస్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో శరత్ హత్యారోపణ ఎదుర్కొంటున్న దుండగుడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో.. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు దుండగుడ్ని మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు పోలీసు అధికారులకు గాయలయ్యాయి. అయితే.. అవేమీ ప్రమాదకరం కాదన్న విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు.మరోవైపు.. శరత్ హత్యను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమేరా దృశ్యాల్ని విడుదల చేశారు. నిందితుడి కోపం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో అందిన సమాచారంతో దుండగుడి ఇంటిని రౌండ్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. కాల్పులు జరిపాడు.. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సదరు దండగుడు మరణించాడు.