Begin typing your search above and press return to search.
శివసేన పతనం వెనుక ఆ లేడి.?
By: Tupaki Desk | 23 Nov 2019 2:32 PM GMTఒక ఆడది కారణం గా యుద్ధాలు జరిగాయని.. సామ్రాజ్యాలు కొట్టుకు పోయాయని మనం చరిత్రలో చదివాం. ఆడవారి వాళ్లే రాజులు, రాజ్యాలు పోయాయని విన్నాం.. కానీ ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్నాం.. అవును మహారాష్ట్ర లో శివసేన పరిస్థితి ఇప్పుడు ఇంతలా దిగజారడానికి కారణం ఒక లేడి అని మహారాష్ట్ర పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.
మహారాష్ట్ర లో బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. శివసేన ఆశలను బీజేపీ చిదిమేసింది. ఆ పార్టీని కోలుకోని దెబ్బ తీసింది. శివసేన నే కాదు.. ఆ పార్టీతో కలవడానికి ప్రయత్నించిన సెక్యులర్ కాంగ్రెస్ ను దారుణం గా దెబ్బ తీసింది.
శివసేన హిందుత్వ పార్టీ. హిందుత్వమే బలం.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. ముస్లింలందరూ కాంగ్రెస్ వెంటే ఉంటారు. కానీ శివసేన-కాంగ్రెస్ కలయిక తో అటు హిందువులు శివసేనకు, ముస్లింలు కాంగ్రెస్ కు దూరమయ్యారు. నెల రోజులుగా వీరి పొత్తు యత్నాలు ఆ పార్టీలను దెబ్బ తీశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక శివసేన ఇలా మహారాష్ట్ర లో రెంటికి చెడ్డ రేవడిలా మారిపోవడానికి ప్రధాన కారణం ఇద్దరేననే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్రలో బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ఆపార్టీపై కయ్యానికి కాలుదువ్వడం.. అవమానించేలా మాట్లాడడం.. పొత్తును కాకుండా చేయడం లో కీలకంగా వ్యవహరించారు. సంజయ్ రౌత్ నోటీ దూల వల్లే శివసేన తో బీజేపీ సంబంధాలు తెంచుకుందనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే భార్య రశ్మీ థాక్రే అత్యాశే ఇప్పుడు శివసేన కొంపముచిందంటున్నారు. శివసేన అధిపతులు సాధారణంగా ఎన్నికలకు రాజ్యాధికారానికి దూరంగా ఉంటారు. కానీ రశ్మీ థాక్రే ఈసారి ఎన్నికల బరిలో దిగాలని తన భర్త ఉద్దవ్ పై ఒత్తిడి తెచ్చిందట.. ఆయన ఒప్పుకోక పోయేసరికి కుమారుడు ఆదిత్య థాక్రేను దించింది. బీజేపీ కి మెజార్టీ రాక పోవడంతో సీఎం సీటు పై తన భర్త లేదా కుమారుడు కూర్చోవాలని బీజేపీ ని డిమాండ్ చేయించడంలో ఉద్దవ్ భార్య ఒత్తిడే కారణమట.. ఇంటిపోరు కారణంగానే ఉద్దవ్ బీజేపీతో దూరం జరిగి పెద్ద తప్పు చేశారని అంటున్నారు.
ఇలా భార్య అత్యాశ.. శివసేన ఎంపీ నోటి దురుసు వల్లే శివసేన ఇప్పుడు మహారాష్ట్రలో రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయింది. కాంగ్రెస్ తో కలిసి హిందుత్వ వాదుల మద్దతు కోల్పోయింది. ఇటు చిరకాల మిత్రుడు బీజేపీతో విడిపోయింది. ఒక ఆడది రాజ్యాలను కూల్చిన చరిత్ర చూశాం కానీ ఇప్పుడు ఒక దిగ్గజ శివసేన పార్టీని ప్రజల్లో విశ్వసనీయత లేకుండా.. రాజకీయాల్లో కుదేలుగా మార్చిన చరిత్రను కళ్లారా చూస్తున్నామని మహారాష్ట్ర పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.