Begin typing your search above and press return to search.
క్యాబ్ డ్రైవర్‌ను 22సార్లు కొట్టిన లేడీ.. మరిన్ని షాకింగ్ సంగతులు ఇవే!
By: Tupaki Desk | 6 Aug 2021 1:49 PM GMTఓ క్యాబ్ డ్రైవర్‌ను వరుస పెట్టి లెక్కపెట్టి మరీ.. 22 సార్లు కొట్టిన ఓ యువతి స్టోరీ.. గుర్తుండే ఉంటుంది. ఇది జరిగింది.. యూపీలోని లక్నోలోనే అయినా.. వ్యవహారం మాత్రం చాలా హాట్ కావడంతో దేశవ్యాప్తంగా సదరు యువతి జబర్దస్త్ గురించి పెద్ద ఎత్తున చర్చించుకోవడం తెలిసిందే. అయితే.. ఆమె అంతగా రియాక్ట్ కావడం ఏంటి? అసలు లెక్కపెట్టి 22 సార్లు కొట్టానని చెప్పడం వెనుక ఉన్న రీజనేంటి? అసలు ఏం జరిగింది? అనే విషయాలు అందరినీ ఆలోచనకు గురి చేశాయి. ఇక, ఈ క్యాబ్ వివాదంపై దృష్టి పెట్టిన పోలీసులు.. ఈ కేసును, ఆ యువతి వ్యవహారాన్ని ఒకింత లోతుగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
ఫస్ట్ నుంచి కూడా సదరు లేడీ వివాదాస్పదంగానే వ్యవహరించేదని అంటున్నారు చుట్టుపక్కల వారు. ఇదే విసయాన్ని పోలీసు లు కూడా ధ్రువీకరిస్తున్నారు. ప్రతిచిన్న విషయాన్నీ.. యాగీ చేయడం.. అరవడం.. కేకలు పెట్టడం.. కంప్లెయింట్లు ఇవ్వడం.. వంటివి ఆమెకు షరా మామూలేనని.. అసలు ఆమెకు మైండ్ సెట్ బాగుందో లేదో కూడా డౌటేనని అంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన ఓ విషయాన్ని తాజాగా వెల్లడిస్తున్నారు. లక్నోకు చెందిన ఆ యువతి పేరు.. ప్రియదర్శిని యాదవ్. ఆమె ప్రవర్తన ఆది నుంచి కూడా వివాదమేనని పోలీసులు స్పష్టత ఇచ్చేశారు.
గతంలోనూ వివాదాలకు కేంద్రంగా ఉన్నారని.. పేర్కొంటూ.. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను ఇప్పుడు బహిర్గతం చేశారు. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేసుకున్నారు. అయితే.. దీనిని ప్రియదర్శిని ఫుల్ పాలిటిక్స్ చేసేసింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యాగీకి దిగింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవ పెట్టుకుంది. వెంటనే రంగు మార్చాలని గొడవకు సైతం దిగింది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని, డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుందని గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు.
పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్ డ్రైవర్‌పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే గొడవ చేస్తున్న ప్రియదర్శిని.. అదే నలుపు రంగు దుస్తులు ధరించింది కదా.. దానికి భయం లేదా? నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. ఈ విషయం ఆసక్తిగా మారింది.