Begin typing your search above and press return to search.

కోవిడ్ మరణాలపై లాన్సెట్ నివేదిక పచ్చి అబద్దం..!

By:  Tupaki Desk   |   12 March 2022 11:30 PM GMT
కోవిడ్ మరణాలపై లాన్సెట్ నివేదిక పచ్చి అబద్దం..!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. వివిధ దేశాలకు విస్తరించిన కోవిడ్ చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విషయంలో భారత్ కు ఏమీ మినహాయింపు లేదని చెప్పాలి. ఇప్పటికే భారత్ లో వరుసగా మూడు వేవ్ ల రూపంలో కోవిడ్ విజృంభించింది. మొదటి, రెండు దశల్లో కోవిడ్ మరణాలు పోల్చితే మూడో దశలో తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా భారత్ పురుడు పోసుకున్న డెల్టా వైరస్.. భారత్ లో మరణాల సంఖ్యను అమాంతం పెంచేసింది. దీంతో రెండో దశలో భారత్ లో చనిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగింది.

మూడు దశల్లో కంటే... రెండో దశలో భారత్ లో చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇదే విషయాన్ని ఇప్పటికే చాలా మీడియా సంస్థలు కథనాలుగా ప్రచురించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన చేసిన మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రభుత్వం చెప్పే లెక్కలకు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో చనిపోయిన వారితో పోల్చితే చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత చెందిన లాన్సెట్ నివేదిక వెల్లడించింది.

మెడికల్ జర్నల్ లాన్సెట్ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కరోనా మరణాల విషయంలో లాన్సెట్ ఇచ్చిన నివేదిక తప్పుల తడక అని ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక డేటా కంటే కోవిడ్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ది లాన్సెట్ చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆరోగ్య వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో సంక్షోభంలో పడినట్లు కేంద్రం తెలిపింది.

ఇలాంటి నేపథ్యంలో లాన్సెట్ సరైన నివేదిక వెల్లడించాలని కోరింది. అంతేకాకుండా కోవిడ్ మరణాల రేటు అనేది చాలా సున్నితమైన వ్యవహారం గా ఉందని తెలిపిన కేంద్రం.. దీనిపై స్పందించినప్పుడు ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ది లాన్సెట్ ప్రచురించిన నివేదికలో ఉన్న సమాచారం అంతా కేవలం ఊహాజనితం అని కొట్టిపారేసింది. అది అంతా తప్పుడు సమాచారంగా అభివర్ణించింది.

లాన్సెట్ ప్రచురించిన కోవిడ్ మరణాల కంటే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన మరణాల సంఖ్య సుమారు ఎనిమిది రెట్లు తక్కువ ఉంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అందులోనూ లాన్సెట్ ప్రచురించిన మరణాలు... డిసెంబర్ 2021 నుంచి జనవరి 2020 మధ్య కాలంలోని వని తెలిపింది. ఈ కాలం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తో సమారుగా.. 22.3 శాతానికి పైగా మరణాలు నమోదైనట్లు పేర్కొంది.

భారత్ లో జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నా కానీ ప్రపంచం తో పోల్చి చూస్తే వీరి మరణాల సంఖ్య తక్కువే అని స్పష్టం చేసింది. ఈ సమయం లోనే భారత్ లో సుమారు 5 లక్షల మంది వరకు చనిపోయారని లెక్కకట్టింది లాన్సెట్. లాన్సెట్ లెక్కకట్టిన మరణాల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. లాన్సెట్ ఇచ్చిన నివేదికలో కచ్చితంగా శాస్త్రీయత అనేది లోపించిందని అధికారులు ఆరోపించారు.