Begin typing your search above and press return to search.
మోడీకి మోత మొదలైందా? తాజా ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేంటి?
By: Tupaki Desk | 3 Nov 2021 5:30 PM GMTఏపీలో బద్వేల్.. తెలంగాణలో హుజూరాబాద్.. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాలు..ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మూడు లోక్ సభ.. 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్ని చూసినప్పుడు.. స్థానికంగా ఉండే అంశాల్ని పక్కన పెడితే.. మొత్తంగా చూసినప్పుడు మోడీ టీంకు కష్టకాలం మొదలైనట్లేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోవటం గమనార్హం. ఈ ఏడింటిలో హుజూరాబాద్ కూడా ఒకటి ఉందని చెప్పాలి. నిజానికి ఈటల విజయం.. ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కానీ బీజేపీ ఖాతాలో వేసుకునేది కాదన్నది వాస్తవం.
ఈటల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలిచేది. హుజూరాబాద్ ఉప ఎన్నిక మొత్తం వ్యక్తుల పేరు మీదనే తిరిగింది. కాకుంటే.. పోలింగ్ లో గుర్తు అవసరం ఉంటుంది కాబట్టి.. కమలం పవ్వు గుర్తును ప్రస్తావించారు. ఆ మాటకు వస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మోడీ బొమ్మను చూపించకుండా.. కేవలం తన బొమ్మతోనే ప్రచారం చేసుకొని తన డబ్బుల్ని ఖర్చు పెట్టి గెలిచిన ఈటలదే ఈ విజయంగా చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. జాతీయస్థాయిలో జరిగిన ఉప ఎన్నికలఫలితాల్ని చూస్తే.. కమలదళానికి కష్టకాలం మొదలైందన్న భావన కలిగేలా పరిస్థితులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి కంచుకోటగా చెప్పే మండీ లోక్ సభ స్థానంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థిని హిమాచల్ మాజీ సీఎం.. సీనియర్ కాంగ్రెస్ నేత.. దివంగత వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్ విజయం సాధించటం సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4.05లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. బీజేపీ తరఫున పోటీ చేసింది మామూలు వ్యక్తి కాదు. కార్గిల్ యుద్ధ వీరుడు అయిన బ్రిగేడియర్ ఖుషాల్ ఠాకూర్ బరిలోకి దిగినా ఓడిపోవటం చూస్తే.. మోడీ ఇమేజ్ మసకబారటం మొదలైందా? అన్న సందేహం కలుగక మానదు. కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేశ్ గవిట్ పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్ విజయంసాధించారు. గతంలో గెలుపొందిన ఖండ్వా ఎంపీస్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్ కైవశం చేసుకోవటం గమనార్హం. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్-కోత్ ఖాయ్ స్థానం తాజాగా కాంగ్రెస్ ఖాతాలో పడింది. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవటం గమనార్హం.
పశ్చిమబెంగాల్ లో జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్ని అధికార టీఎంసీ సొంతం చేసుకుంది. తాజా విజయంతో 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో తమ సీట్ల సంఖ్యను 215కు పెంచుకుంది. మరో షాకింగ్ అంశం ఏమంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లలో దాదాపు తాజా ఉప ఎన్నికల్లో 15 శాతం ఓట్ల షేర్ తగ్గిపోవటం చూస్తే.. బీజేపీ ప్రభ మసకబారుతుందన్న సందేహం రాక మానదు.
కర్ణాటకలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి బీజేపీ గెలవగా.. మరొకటి కాంగ్రెస్ విజయం సాధించింది. తాజా ఎన్నికల ఫలితాలు బీజేపీ కొత్త ముఖ్యమంత్రి బొమ్మైకు ఇబ్బందికరంగా మారాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన మూడు స్థానాల్లో రెండింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అయితే.. ఈ రెండు గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్నవి కావటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశం. అదే సమయంలో బీజేపీకి చెందిన స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
అసోంలో జరిగిన మొత్తం ఐదు అసెంబ్లీస్థానాల్ని బీజేపీ కూటమి విజయం సాధించి.. ఆ రాష్ట్రంలో తమకు తిరుగులేదన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. మేఘాలయలోనేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ కూటమి మొత్తం మూడు సీట్లను సొంతం చేసుకుంది. బిహార్ లో జరిగిన రెండు జేడీయూ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకోగా.. రాజస్థాన్ లో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ రెండింటిని సొంతం చేసుకుంది. ఇందులో ఒకటి బీజేపీకి చెందిన సీటు కావటం గమనార్హం.
మహారాష్ట్రలో జరిగిన ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. హరియాణాలో జరిగిన ఎల్లెనాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి విజయం సాధించారు. మిజోరంలో తురియల్ స్థానంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక.. ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థి 90వేల ఓట్లకు పైచిలుకు మెజార్టీతో విజయం సాధిస్తే.. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించటం తెలిసిందే.