Begin typing your search above and press return to search.
ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. సత్తాచాటిన సంజూ శాంసన్!
By: Tupaki Desk | 13 April 2021 8:53 AM GMTసంజూ శాంసన్.. చూస్తుండగానే కెప్టెన్ గా ఎదిగిపోయిన కుర్రోడు.. కెప్టెన్ గా తొలి సీజన్లోనే సత్తా చాటాడు. ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్ రికార్డు నమోదు చేశాడు. సోమవారం పంజాబ్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ దుమ్ములేపాడు. సెంచరీతో చెలరేగిపోయాడు. మొత్తం 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు.
కేవలం 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన శాంసన్.. 54 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అందరిచేతా ఔరా అనిపించాడు. కానీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 221 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ మొదలు పెట్టిన రాజస్తాన్ జట్టు.. నాలుగు పరుగుల వద్ద ఆగిపోయింది. 217 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయినప్పటికీ.. శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ కెప్టెన్ కూడా సెంచరీ చేయలేదు. ఇతరులు సెంచరీ చేసినప్పటికీ.. కెప్టెన్ గా మాత్రం మొదటి సెంచరీ కొట్టింది శాంసన్ మాత్రమే. తనదైన బ్యాటింగ్ తో సత్తా చాటిన 26 ఏళ్ల శాంసన్.. ఈ సీజన్లో మున్ముందు ఇంకెలాంటి అద్భుతాలు నమోదు చేస్తాడో చూడాలి.