Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వేయించుకోవటానిక ఇష్టపడటం లేదట

By:  Tupaki Desk   |   15 Nov 2020 11:30 PM GMT
వ్యాక్సిన్ వేయించుకోవటానిక ఇష్టపడటం లేదట
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకుప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ ప్రయోగాలు మూడోదశకు చేరుకున్నాయి. అన్ని బాగుంటే.. వచ్చే నెల చివర్లో వ్యాక్సిన్ వస్తుందని కొందరు చెబుతుంటే.. అదేమీ కాదు.. వచ్చే జనవరి.. ఫిబ్రవరికి కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాదన్న మాట వినిపిస్తోంది.

ఇలా ఉంటే.. వ్యాక్సిన్ కోసం గతంలో మాదిరి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూడటం లేదన్న విషయాన్ని తాజా సర్వే ఒకటి బయపెట్టటం గమనార్హం. ఫ్యూ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. మే లో ఈ సంస్థ జరిపిన సర్వేలో వ్యాక్సిన్ వస్తే వేసుకుంటామని ముందుకు వచ్చిన వారు 72 శాతం మంది ఉంటే.. తాజాగా జరిపిన సర్వేలో అది కాస్తా 50 శాతానికి తగ్గిపోవటం గమనార్హం.

దీనికి కారణం వ్యాక్సిన్ వేయించుకోవటానికి ప్రజలు మక్కువ చూపించటం లేదంటున్నారు. వ్యాక్సిన్ పరిశోధనల మీద అమెరికాలో జరుగుతున్న ప్రచారం.. చోటు చేసుకుంటున్న పరిణామాలు దానిపైన నమ్మకం తగ్గేలా చేస్తుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితి ఏ మాత్ంర మంచిది కాదని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించాలన్నారు. లేనిపక్షంలో కరోనాను నివారించటం కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రఖ్యాత కంపెనీలు చేస్తున్న పరిశోధనల ఫలితాలు తొలుత ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఎదురవుతున్న సమస్యలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలో ప్రముఖంగా రావటంతో వ్యాక్సిన్ పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీకాలపై సహజంగా ఉండే అనుమానాల్ని ఇవి రెట్టింపు చేస్తున్నాయి. దీంతో.. టీకా వినియోగించే విషయంలో ప్రజల అభిప్రాయాల్లో మార్పువస్తున్నట్లు చెబుతున్నారు.