Begin typing your search above and press return to search.
తాజాగా జరిగిన బదిలీ.. కేసీఆర్ ఫ్యామిలీకి షాకివ్వనుందా?
By: Tupaki Desk | 21 Sep 2022 1:30 AM GMTఈడీ.. బోడీ.. ఎవరూ ఏమీ చేయలేరు.. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్యూను సీరియస్ గా టేకప్ చేసిన మోడీ సర్కారు.. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ప్రచార మాథ్యమాల్లోకానీ.. సోషల్ మీడియాలో కానీ పెద్దగా హడావుడి జరగకుండా ఒక కీలక అధికారిఒకరు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ ఫర్ కాగా.. మరో అధికారి వచ్చేస్తున్న వైనం చూసినప్పుడు.. తుపాను ముందు ప్రశాంత వాతావరణం లాంటిదని చెబుతున్నారు.
కేసీఆర్ కుటుంబంపై మోడీ సర్కారు ఫోకస్ చేయటం.. వారికి లభించిన ప్రాధమిక సమాచారం ప్రకారం బలంగా దెబ్బ కొట్టొచ్చనే విషయంపై వారికి నైతిక బలాన్ని చేకూర్చే ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు. గడిచిన నెల రోజులుగా వేర్వేరుగా జరిగిన సోదాలు మొత్తం ఒకటే లక్ష్యం కోసమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బొట్టు బొట్టును కలిపి.. చివరకు అదో పెద్ద జలపాతంగా మారే దానికి ప్రతిగా.. చిన్న చిన్న అంశాలతో మొదలైన వెతుకులాట.. తాజాగా పెద్ద తీగే కాలికి తగిలినట్లుగా చెబుతున్నారు.
ఇంతకాలం ఈడీ సోదాలే భారీగా జరగటం.. ఆ మధ్యన ఐటీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించటం తెలిసిందే. అయితే.. వీటి కారణంగా పెద్దగా ఫలితం లేకపోవటంపై కేంద్రం ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. దీని లింకును తాజాగా గుర్తించిన కేంద్రం.. కేసీఆర్ కుటుంబానికి చెక్ పెట్టేందుకు వీలుగా.. ఒక కీలక స్థానంలో ఉన్న మహిళా అధికారిణిని బదిలీ చేసినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను తాజాగా బదిలీ చేసింది.
ఆమె స్థానంలో ప్రస్తుతం ముంబయిలో ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్ ని ఐటీ దర్యాప్తు విభాగం డీజీగా బదిలీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. సీఎం కేసీఆర్ కుటుంబానికి కొత్త కష్టాలు ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఒక అధికారి బదిలీతోనే సినిమా మారిపోతుందా? అంటే అవునన్న మాట అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఐఆర్ఎస్ వసుంధరా సిన్హా మరెవరో కాదు.. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న అంజనీ కుమార్ సతీమణి ఆమె. గతంలో ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు.
వసుంధరా సిన్హా నిర్వర్తించిన కీలకమైన విధుల్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పిలేట్ అధారిటీ ఒకటి. కార్పొరేట్.. నాన్ కార్పొరేట్ సెక్టార్ పై మంచి పట్టున్న ఆమెను తప్పించి.. ఆ స్థానంలో ముంబయికి చెందిన అధికారిని నియమించటం చూస్తే..రానున్న రోజుల్లో ఐటీ శాఖ దూకుడుగా వ్యవహరించటానికి అవసరమైన గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అవినీతిని వెలికి తీసే రెండు కీలక శాఖలకు భార్యభర్తలే ఉండటం.. ఇద్దరూ తెలంగాణలో కీలక స్థానాల్లో ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఆమెను తప్పించి.. మరొకరిని తీసుకురావటంతో కొత్త సమీకరణాలకు తెర తీసినట్లవుతుందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని పలు బడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. వాటిల్లో ముఖ్యమైనవి వాసవి.. ఫినిక్స్.. లాంటి సంస్థలు ఉన్నాయి. వీటిల్లో కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతారు. ఈ మధ్యన చేపట్టిన తనిఖీల్లో కీలక సమాచారం అభించినట్లుగా చెబుతున్నారు. కానీ.. దానికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. ముంబయి నుంచి కొత్తగా వస్తున్న సంజయ్ బహదూర్ కు ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు తెలుసని.. మంచిగా హ్యాండిల్ చేస్తారని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా మరో కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనటానికి హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. తన బిజీ షెడ్యూల్ లో నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించినట్లు చెబుతున్నారు.
అకాడమీలో అధికారులతో భేటీ అయ్యాక.. ఆదాయపన్ను శాఖాధికారులతో కూడా అమిత్ షా రివ్యూ నిర్వహించినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. మొత్తంగా చూస్తే.. సంచలన పరిణామాలకు సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ చాలా పద్దతిగా సాగుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనలో నిజమెంతో కాలమే సరైన సమాధానం చెప్పగలదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.