Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయవాది

By:  Tupaki Desk   |   20 March 2021 11:36 AM GMT
నిమ్మగడ్డ పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయవాది
X
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రాసిన లేఖలు లీక్ అవుతున్న వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో నిమ్మగడ్డ ‌పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. పిటిషన్ ‌లో పలు విషయాలు రమేష్ ప్రస్తావించారు. తాను గవర్నర్ ‌తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ బయటికి లీకవుతున్న విషయంపై నిజానిజాలేంటో తేల్చాలని పిటిషన్‌ లో నిమ్మగడ్డ తెలిపారు. అంతేకాదు, ఈ అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ ఈ సీ పిటిషన్ వేయడం జరిగింది. నేను గవర్నర్‌ కు రాస్తున్న లేఖలు పబ్లిక్ కాదు.. ప్రివిలేజ్ లెటర్స్.. అవి ఎలా బయటికి వస్తున్నాయనేది విచారణ చేయాలి.

నేను సెలవు పెడుతోన్న విషయాలు సైతం ఎలా బయటికి లీవుతున్నాయి. నేను గవర్నర్‌ కు రాసిన లేఖలు సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెప్తున్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రతివాదులుగా చేరుస్తున్నాను అని పిటిషన్ ‌లో నిమ్మగడ్డ తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ కేసు విచారణ సందర్భంగా నాట్ బీ ఫోర్ మి అని హైకోర్ట్ న్యాయమూర్తి తెలిపారు. చీఫ్ జస్టీస్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిటిషన్‌ ను వేరే బెంచ్ ‌కి వేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి సూచించారు.

దీనితో ఇవాళ ఎటువంటి విచారణ జరగలేదు. చీఫ్ జస్టిస్ హైకోర్ట్ రిజిస్ట్రార్‌ కు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ కేసును ఏ బెంచ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఎలా ముందుకెళ్తుంది. అనేదానిపై అందరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే , జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఎస్ ఈసీని ఆదేశించాలని హైకోర్ట్ ‌లో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్ ‌పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తిచేశామని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. పరిషత్ ఎన్నికల నిర్వహణ ఎస్ ఈ సీ దృష్టిలో ఉందని, ఇప్పుడే దీనిపై కోర్టులో పిటిషన్ వేయటం ప్రి మెచ్యూఆర్ అని ఎస్ ఈ సీ తెలిపింది. అయితే , దీనిపై తీర్పును హైకోర్ట్ న్యాయమూర్తి రిజర్వ్ ‌‌లో ఉంచినట్లు సమాచారం.