Begin typing your search above and press return to search.

3000 ఏళ్ల ఈజిప్టు మమ్మీ మాట్లాడింది ...ఏం చెప్పిందంటే ?

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:41 AM GMT
3000 ఏళ్ల ఈజిప్టు మమ్మీ మాట్లాడింది ...ఏం చెప్పిందంటే ?
X
ఈజిప్ట్ అనగానే గుర్తచ్చే వాటిలో మమ్మీ ఒకటి. కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయేవాళ్లను మమ్మీలుగా పూడ్చిపెట్టేవారు. వాటిలో ఓ మమ్మీ మాట్లాడితే ఎలావుంటుంది? తాజాగా సుమారు 3 వేల ఏళ్ళ క్రితం మమ్మీగా పూడ్చిపెట్టిన వ్యక్తి తో శాస్త్రవేత్తలు మాట్లాడించారు. ఇది ఆధునిక పరిశోధనల్లో మరో కలికితురాయి. సుమారు 3 వేల సంవత్సరాల నాటి ఈజిప్ట్ మమ్మీ స్వరాన్ని లండన్ కి చెందిన శాస్త్రవేత్తలు మళ్లీ పునరుద్ధరించారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఈ అద్భుతాన్ని కృతిమంగా సృష్టించగలిగారు. అసలు మమ్మీ ఏంటి ..మాట్లాడటం ఏమిటి అని అనుకుంటున్నారా ..అయితే మనం ఒకసారి 3000 వేల సంవత్సరాల ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం లో ఫారో రామెసెస్ XI పాలన కాలంలో నెశ్యామన్ అనే వ్యక్తి జీవించేవాడు. అయన ఒక మతగురువు కావడం తో అయన గొంతు చాలా అద్భుతంగా ఉండేది. ఆ గొంతు తో అయన ఎన్నో పాటలు పడేవారు.

ఇకపోతే, ప్రస్తుతం అతడి మమ్మీ ఇంగ్లాండులోని లీడ్స్ సిటీ మ్యూజియంలో ఉంది. నెశ్యామన్ మమ్మీని 1824లో తెరచి పరీక్షించారు. అతడు 50 ఏళ్ల వయస్సు లో చని పోయాడని తెలిసింది. అతడి నాలుక బయట కు వచ్చి ఉండటంతో తొలుత అతడిని ఎవరో గొంతు నులిచి చంపేశారని భావించారు. కానీ , మరికొన్ని పరీక్షల తర్వాత.. నోటిలో ఇన్ఫెక్షన్ వల్ల అతడి నాలుక బయటకు వచ్చిందని తెలుసుకున్నారు. అయితే , 1941లో ఈ మమ్మీ ధ్వంసమయ్యేదే. అప్పట్లో లీడ్స్ మ్యూజియంపై అప్పట్లో బాంబుదాడి జరిగింది. దీంతో ఆ మ్యూజియం మొత్తం నాశనమైంది. అయితే, ఆ దాడికి ముందే నెశ్యామన్ మమ్మీ ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తాజా పరిశోధనల్లో ఈ మమ్మీపై కొన్ని ప్రయోగాలు చేశారు. అప్పట్లో నెశ్యామన్ స్వరం ఎలా ఉండేదో తెలుసుకోవడం కోసం అతడి స్వర మార్గాన్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా పునరుద్ధరించారు. అందులో నుంచి గాలిని పంపి అప్పట్లో అతడి గొంతు ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రయత్నించారు. ఆలా అతడి గొంతులోకి గాలిని పంపగా ఏక స్వరం వినిపించింది. ఏదేమైనా కూడా పూర్తీ స్థాయి లో ఈ పద్దతి కనుక అందుబాటు లోకి వస్తే ఎన్నో విషయాలని పురాతన మమ్మీల నుండి తెలుసుకోవచ్చు.