Begin typing your search above and press return to search.

కరోనా బాధితుల్లో యాంటీ బాడీల జీవితకాలం కొంతకాలమే..!

By:  Tupaki Desk   |   15 Aug 2020 4:30 PM GMT
కరోనా బాధితుల్లో యాంటీ బాడీల జీవితకాలం కొంతకాలమే..!
X
దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ఏ రోజు కారోజు కేసుల నమోదులో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు వ్యాక్సిన్ తయారీలో పలు దేశాల శాస్త్రవేత్తలు, ప్రైవేట్ సంస్థలు అహోరాత్రులు కష్టపడుతున్నాయి. టీకా కోసం ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మరో సరికొత్త విషయం వెలుగులోకి రావడంతో అందరూ కలవరం చెందుతున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నవారిని ఆందోళనలో ముంచుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కరోనా మందులు కానీ రాబోయే వ్యాక్సిన్ ల లక్ష్యం కానీ ఒక్కటే. అదే మానవ శరీరంలో యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడం. కరోనా వచ్చిన వారికి వైరస్ తో పోరాడేందుకు సరిపడా యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడం కోసం వ్యాక్సిన్ ఇస్తారు.

అయితే తాజాగా శరీరంలో యాంటీ బాడీల జీవితకాలం చాలా తక్కువేనని కొందరు శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మరి వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి ప్రయోజనం ఏంటీ అనే ప్రశ్న తెలెత్తుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో పలు దశలకు చేరుకున్న వారికి యాంటీ బాడీల జీవిత కాలం తక్కువ అని తెలియడంతో వ్యాక్సిన్ పని తీరు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 'శరీరంలోని యాంటీ బాడీలు ఎక్కువ కాలం జీవించవు ' అని లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టెట్స్ నకాయమ చెబుతున్నారు. 2002-03లో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సార్స్ వైరస్ ప్రబలింది. ఆ సమయంలో ఇచ్చిన టీకాలతో మనిషి శరీరంలో 18 ఏళ్ల పాటు యాంటీ బాడీలు జీవించాయట. అయితే వాటికి నిజంగా ఇన్ఫెక్షన్ ఎదుర్కొనేంత శక్తి ఉందా లేదా అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదట. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమైనా యాంటీ బాడీల జీవితకాలం తక్కువగా ఉంటే వైరస్ ని ఎదుర్కోవడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.