Begin typing your search above and press return to search.
గవర్నర్ తమిళ సై విప్పిన అవమానాల చిట్టా.. ఢిల్లీలోనే ఎందుకు?
By: Tupaki Desk | 8 April 2022 8:31 AM GMTరాజకీయాలు ఎప్పుడూ అంతే. ఎక్కడో స్విచ్ వేస్తారు. మరెక్కడో లైటు వెలుగుతుంది. గడిచిన కొన్నేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఒక గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టటం చూశామా? అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో. అయితే.. ఎవరూ చేయని పనుల్ని కొందరు చేస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు తమిళ సై. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ నేతగా సుపరిచితురాలైన ఆమె.. పార్టీ కోసం పడిన శ్రమను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పంపటం తెలిసిందే. ఆమె ఎంపిక ప్రకటన వెలువడిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరిగింది.
అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ తో కలిసి పోయినట్లుగా కనిపించిన ఆమె.. గులాబీ బాస్ తీసుకున్న ఒక నిర్ణయానికి ఆమె నో చెప్పటం.. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయినట్లుగా ఆమె చెబుతున్న మాటల్ని చూస్తే అర్థమవుతుంది. నచ్చిన వారి విషయంలో కేసీఆర్ వ్యవహరించే తీరుకు.. నచ్చని వారిని ఆయన ఎలా చూస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
దీంతో.. తమిళ సై చెప్పిన మాటలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఢిల్లీలో మీడియాతో ప్రత్యేకించి అంతసేపు ఎందుకు మాట్లాడినట్లు? అన్నది అసలు ప్రశ్న. ఇక్కడే బీజేపీ మార్కు రాజకీయం బయటకు వస్తుందన్న మాట వినిపిస్తోంది.
జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్..మోడీ సర్కారు విధానాల్ని.. వారు అనుసరించే వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న కసరత్తులో ఆయన ఉండటం.. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీ అధినేతల్ని ఆయన కలవటం తెలిసిందే. జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగేందుకు తపిస్తున్న కేసీఆర్ ను.. ఆయనకు ఆ స్థాయి లేదన్న విషయంతో పాటు.. గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఒక మహిళ విషయంలో ఆయన ఎంత నిర్దయగా వ్యవహరించారన్న విషయంతో పాటు.. ప్రోటోకాల్ ను అస్సలు పట్టించుకోని అధినేతగా అందరికి అర్థమయ్యేలా చెప్పటం కోసమే తమిళ సై మీడియాతో అంతసేపు మాట్లాడినట్లు చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించే వారికి ఇరుకైన భావజాలం ఉండకూదని.. ప్రత్యేక సందర్భాల్లో తప్పించి మిగిలిన సమయాల్లో ఎలాంటి మరక లేకుండా క్లీన్ గా ఉండాలన్న భావన వ్యక్తమవుతోంది. దేశాన్ని ఒక తాటి మీద నడిపించాలని తపించే వారికి ప్రాంతాలతోనూ.. వ్యక్తులతోనూ పంచాయితీలు ఉండకూడదు.
కానీ.. ఇలాంటి గుణాలు సీఎం కేసీఆర్ లో లేవన్న భావన కలిగేందుకు వీలుగా గవర్నర్ మీడియా సమావేశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టటం ద్వారా జాతీయ మీడియా కంట్లో పడటంతో పాటు.. సీఎం కేసీఆర్ తీరును అందరికి తెలిసేలా చేయటం కోసమే దేశ రాజధానిలో ఆయన చిట్టాను తమిళ సై విప్పారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.