Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో దారుణాలు: మైనర్లు, మహిళలను రేప్ చేస్తున్న రష్యా సైనికులు

By:  Tupaki Desk   |   4 April 2022 4:30 PM GMT
ఉక్రెయిన్ లో దారుణాలు: మైనర్లు, మహిళలను రేప్ చేస్తున్న రష్యా సైనికులు
X
ఉక్రెయిన్ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా చేస్తున్న ఘోరాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్కడ పట్టు సాధించలేకపోతున్న రష్యా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నారు. కనిపించిన ప్రజలను చంపుతున్నారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఆ దేశం మీద రష్యా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ నియమాలను రష్యా ఉల్లంఘించిందని ఇప్పటికే ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో రష్యా సైనికుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.

యుద్ధాన్ని ముగించలేకపోతున్న రష్యా సైనికులు తమ ప్రతాపాన్ని ఉక్రెయిన్ ప్రజలపై చూపుతున్నారు. ఉక్రెయిన్ లోని మైనర్ అమ్మాయిల మీద, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల మర్మాంగం, వారి శరీరంలోని సున్నితమైన భాగాల్లో కాల్చిన ఇనుప కడ్డీలతో గుర్తులు పెడుతున్నారని ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ క్రమంలోనే అత్యాచారం, హత్యకు గురైన ఉక్రెయిన్ మైనర్ అమ్మాయిలు, మహిళల మర్మాంగాలు, సున్నితమైన ప్రాంతాల్లో ఒకే రకం అయిన కాల్చిన గుర్తులు ఉన్నాయని.. ఇది ఖచ్చితంగా రష్యా సైనికుల అరాచకాలు అని ఉక్రెయిన్ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రష్యా ప్రభుత్వం కాని.. రష్యా సైనికులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉక్రెయిన్ మీద ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ మీద రష్యా సైనికులు యుద్ధం చేస్తూనే ఉన్నారు.ఉక్రెయిన్ ను ఇప్పటికీ స్వాధీనం చేసుకోవడం లేదు. ఎలాగైనా పట్టు సాధించాలని రష్యా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ లో మైనర్ అమ్మాయిల మీద, మహిళల మీద అత్యాచారం చేస్తున్నారని.. బాధితుల మర్మాంగం, వారి శరీరంలోని సున్నితమైన భాగాల్లో కాల్చిన ఇనుప కడ్డీలతో గుర్తులు పెడుతున్నారని ఉక్రెయిన్ మహిళా ఎంపీ లెసియా వాసిలెంక్ సంచలన ఆరోపనలు చేసింది.

అత్యాచారం, హత్యకు గురైన ఉక్రెయిన్ మైనర్ అమ్మాయిలు, మహిళల మర్మాంగాలు, సున్నితమైన ప్రాంతాల్లో రష్యా సైనికులు ఒకే రకం కాల్చిన గుర్తులు ఉన్నాయని.. ఇది ఖచ్చితంగా వారి పనే అని మహిళా ఎంపీ సంచలన సాక్ష్యాలు విడుదల చేసింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. రష్యా సైనికులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.