Begin typing your search above and press return to search.

వాళ్లను తప్పిస్తే కానీ రాహుల్ పదవి తీసుకోలేడా?

By:  Tupaki Desk   |   9 Sept 2020 6:00 PM IST
వాళ్లను తప్పిస్తే కానీ రాహుల్ పదవి తీసుకోలేడా?
X
కాంగ్రెస్ కు సీనియర్లే శాపమని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యాడట. అందుకే వారు పార్టీని వీడితే కానీ పగ్గాలు చేపట్టనని మొండికేస్తున్నాడు. కానీ సోనియా మాత్రం వృద్ధ జంబూకాలపై ఆశలు వదలు కోవడం లేదట.. దీంతో రాహుల్ గాంధీ తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకోనని మొండికేస్తున్నాడట.. ఈ ఫుల్ ఎపిసోడ్ లో రాహుల్ పదవి తీసుకోవడానికి ప్రధాన అడ్డంకిగా సీనియర్లే ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడీ కథ ఢిల్లీలో చర్చనీయాంశమవుతోంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అధ్యక్ష పదవి బరువైందని.. ఆమెకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి కనీసం నేతలకు అపాయింట్ మెంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అని ఢిల్లీ వర్గాల్లో టాక్ ఉంది. అందుకే రాహుల్ గాంధీని ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తీసుకోవాలని అందరూ కోరుతున్నారంట..

అయితే పార్టీ పూర్తిగా ప్రక్షాళన అయితేనే కానీ తాను అధ్యక్ష పదవి చేపట్టనని రాహుల్ గాంధీ మొండికేస్తున్నాడట.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే సీనియర్లకు మంగళం పాడాలని.. మళ్లీ ఓడిపోతే ఇక కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు అని.. ముందుగా బీజేపీ కోవర్ట్ లను కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తీసేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నాడట.. బీజేపీ కోవర్టులకు గులాం నబీ అజాద్ సారథ్యం వహిస్తున్నారని.. వాళ్ల అందరినీ తప్పిస్తే కానీ తాను పదవి తీసుకోని అని రాహుల్ గాంధీ అధినేత్రి సోనియా ముందు కుండబద్దలు కొట్టాడంట..

పార్టీలోని యువ నాయకత్వంకు సపోర్టు చేస్తూ వారికి పదవులు ఇస్తే తప్ప తాను పదవిని తీసుకోనని రాహుల్ గాంధీ చెప్తున్నారంట.. ఇంకా వృద్ధ జంబూకాలను పట్టుకొని నేను పార్టీని ఈదలేను అని.. యువకులకు పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తే కానీ పార్టీ బతికదు అని రాహుల్ తెగేసి చెప్తున్నాడట..

ఇప్పుడంతా 30-40శాతం సోషల్ మీడియా మీద నడుస్తోందని.. అలాంటప్పుడు వృద్ధ జంబూకాలు కొత్త ఓటర్లకు ఎవరు తెలియదని అని కూడా చెప్పారంట.. కాంగ్రెస్ లో కూడా రాహుల్ చెప్పింది నిజమని.. యువ నేతలను తీసుకొని పార్టీకి జవసత్వాలను నింపాల్సిన అవసరం ఉందని పెద్దఎత్తున ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.