Begin typing your search above and press return to search.

కరోనా మగవారికే ఎందుకు ఎక్కువగా వస్తోంది !

By:  Tupaki Desk   |   12 Feb 2020 9:30 PM GMT
కరోనా మగవారికే ఎందుకు ఎక్కువగా వస్తోంది !
X
కరోనా వైరస్ ..ప్రపంచ దేశాలకి గత కొన్ని రోజులు గా నిద్ర లేకుండా చేస్తోంది. ఈ వైరస్ చైనా ని అతలాకుతలం చేసేసింది. అలాగే చైనా నుండి ఈ వైరస్ ఇప్పటికే సుమారు గా 26 దేశాలకి విస్తరించింది. మొత్తంగా ఈ కరోనా భారిన పడి ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు మృత్యు వాత పడ్డారు. 40వేల మందికి పైగా పేషెంట్లు ఐసీయూల్లో కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనా వారే.

అయితే , కరోనా పై తాజాగా ఒక పరిశోధన చేసిన చైనా వైద్య నిపుణులు మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. వారి పరిశోధనల ప్రకారం చైనాలోని వూహాన్ లో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఎక్కువగా మగవాళ్లకే సోకుతోంది. 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను స్టడీ చేసిన తర్వాత ఈ విస్తుపోయే నిజాన్ని బయటపెట్టారు. అనారోగ్యంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు కరోనా తొందరగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలిసింది. వారిలో ఉండే కొన్ని బయోలాజికల్ కండీషన్స్ వల్ల కొందరికి తొందరగా కరోనా వచ్చే అకాశముంది. కరోనా బాధితుల్లో మహిళల సంఖ్య ఎందుకు తక్కువుగా ఉందో వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా కరోనా వైరస్ భారిన పడిన వారిలో 54శాతం మంది మగాళ్ల సగటు వయస్సు 56 ఏళ్లు. వూహాన్ జినియాంటన్ హాస్పటల్ లో పేషెంట్ల సగటు వయస్సు 55.5 ఏళ్లు. వీళ్లలో 32 శాతం మంది ఆడవాళ్లు. ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్ బాధితుల సగటు వయస్సు 47 ఏళ్లు. వీళ్లలో 58 శాతం మంది పురుషులు. దీని ప్రకారం 50 ఏళ్ల వయస్సున్న మగాళ్లకే ఎక్కువగా కరోనా ఎందుకు సోకుతుంది? అయితే ఈ అంచనా తప్పని కొందరు వాదిస్తున్నారు.

అయితే , X chromosome సమీపంలోని కొన్ని జీన్స్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ వల్ల కరోనా లాంటి వైరస్ లు తొందరగా ఆడవాళ్ల శరీరంలో వ్యాపించడం లేదన్నది. ఈ విషయంలో మగాళ్లు వీక్ గా ఉంటారని తక్కువున్నాయని అంటున్నారు. అలాగే మరో విషయం ఏమిటంటే మధుమేహం, హృదయ సంబంధ రోగాలున్న మగాళ్లకు కరోనా ఎక్కువగా సంక్రమిస్తోంది. కాకపోతే Huanan Seafood Wholesale Marketలో ఎక్కువ మంది పని వాళ్లు మగాళ్లు కాబట్టి, కరోనా పేషెంట్ల లో మగాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారని కొందరు నిపుణులు చెప్తున్నారు.