Begin typing your search above and press return to search.

పిడుగుపాటుకు గురైన మనిషి బతకాలని.. ఏం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   21 May 2021 1:30 AM GMT
పిడుగుపాటుకు గురైన మనిషి బతకాలని.. ఏం చేశారో తెలుసా?
X
శాస్త్ర విజ్ఞానం ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా.. కొంద‌రు మ‌నుషులు ఆలోచ‌న‌లు మాత్రం ఇంకా పాతాళంలోనే ఉండిపోవ‌డం విషాద‌క‌రం. దీన్ని నిరూపించే ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలో జ‌రిగింది. అక్క‌డ వ‌ర్షాలు కురుస్తుండ‌గా.. అక‌స్మాత్తుగా పిడుగు ప‌డింది. దీంతో.. ఓ వ్య‌క్తి నేల‌కూలాడు. స‌హ‌జంగా ఎవ‌రైనా ఏం చేస్తారు? ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తీసుకెళ్తారు. కానీ.. అక్క‌డి జ‌నాలు ఏం చేశారో తెలుసా?

కింద ప‌డిపోయిన 37ఏళ్ల వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్టు నిర్ధారించిన జ‌నాలు.. అత‌ను మ‌ళ్లీ బ‌తికొస్తాడంటూ వింత చేష్ట‌ల‌కు దిగారు. ఓ పెద్ద బొంద త‌వ్వారు. అందులో మొత్తం ఆవుపేడ నింపారు. ఆ మ‌నిషిని అందులో పూడ్చిపెట్టారు. ఇలా చేస్తే బ‌తికొస్తాడ‌ని కొన్ని గంట‌ల‌పాటు అలాగే ఉంచారు.

ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు తీసి చూశారు. ఏం జ‌రిగి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదుగా! ఆ త‌ర్వాత ఎవ‌రో వైద్యున్ని పిలిస్తే.. ఆయ‌న చూసి అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని చెప్పాడ‌ట‌. మ‌రి, పిడిగు ప‌డ‌గానే మ‌ర‌ణించాడా? వీళ్లు బొందలో పూడ్చిన తర్వాత మరణించాడా? అన్న‌ది తెలియ‌లేదు. ఒక‌వేళ స్పృహ త‌ప్పినా.. బొంద‌లో పూడ్చినందుకు ప్రాణాలు కోల్పోయి ఉండేవాడేన‌ని కూడా చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా! ఇలాంటి అజ్ఞానం జ‌నాల‌ను ఇంకా పీడిస్తుండ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తమ‌వుతోంది.