Begin typing your search above and press return to search.

మారుతీ చార్జింగ్ కారు వచ్చేది అప్పుడేనట

By:  Tupaki Desk   |   21 July 2021 6:45 AM GMT
మారుతీ చార్జింగ్ కారు వచ్చేది అప్పుడేనట
X
ప్రస్తుత తరుణంలో వాహన సంస్థలన్నీ ఎలాగైనా సరే ఎలక్ర్టిక్ వాహనాలను విపణిలోకి తీసుకువచ్చి తమ కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చైనా సరే వెనుకాడడం లేదు. ఎలక్ర్టిక్ వాహనాల వాడకం మూలాన పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం ఉండదని ఎక్కువ మంది వాహనదారులు ఎలక్ర్టిక్ వాహనాలు వాడేలా ప్రోత్సహించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం సంస్థలు రాయితీలు ప్రకటించేలా చేస్తోంది. ఇదెలా అని ఆశ్చర్యపోతున్నారా? కేంద్రం ఎలక్ర్టిక్ వాహన కంపెనీలకు అధికంగా ఇస్తున్న సబ్సిడీల మూలంగా సంస్థలు కూడా తమ కస్టమర్లకు మంచి, మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇలా ఎలక్ర్టిక్ వాహనాల ఉత్పత్తులను పెంచేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోంది.

అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలతో పోల్చి చూసుకుంటే ఎలక్ర్టిక్ వాహనాలను వాడడం చాలా మేలని అనేక మంది భావిస్తున్నారు. సాధారణ ప్రజానీకంతో పాటు పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఎలక్ర్టిక్ వాహనాలను వాడాలని సూచిస్తున్నారు. ఎలక్ర్టిక్ వాహనాల వల్ల ఎటువంటి కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కావు. తద్వారా పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది. అందుకే ఎలక్ర్టిక్ వాహనాలను వాడాలని అందరూ సూచిస్తున్నారు.

ఇండియాలో కార్లలో మారుతీ సుజుకీ తమ కంటూ ప్రత్యేక ప్లేస్ ఏర్పరచుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. 2025లోనే మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన తొలి ఎలక్ర్టిక్ కారు విపణిలోకి రానున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం మరో నాలుగేళ్లలో మారుతీ సుజుకీకి చెందిన ఎలక్ర్టిక్ కారును మనం వీక్షించవచ్చు. తాము తమారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు మోడల్ ను భారత మార్కెట్ లో నే ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తర్వాతే జపాన్ యూరోప్ తదితర దేశాలకు పంపుతామని ప్రకటించారు. కానీ ఈ కారు ధర మాత్రం చాలా.. అనేలాగే ఉంది. ఈ కారుకు భారత్ లో దాదాపు పది లక్షల పై చిలుకు ధరే ఉండనుందని తెలిపింది.

ఇంతకు ముందే మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన వాగన్ ఆర్ మోడల్ లో ఎలక్ర్టిక్ కారును వచ్చే ఏడాదే కంపెనీ విడుదల చేస్తుందని వార్తలు షికారు చేశాయి. కానీ కంపెనీ మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇన్నాళ్లు ఎలక్ర్టిక్ వాహనాలపై దృష్టి సారించకపోవడానికి గల కారణాలను ప్రకటించింది. వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు సరైన వసతులు లేని కారణంగానే ఇన్ని రోజులు అటువైపు ఆలోచన చేయలేదని కంపెనీ ప్రకటించింది.

అంతే కాకుండా ఎలక్ర్టిక్ వాహనాల ధరలు అధికంగా ఉండడం కూడా ఓ కారణమని కంపెనీ అభిప్రాయ పడింది. పై రెండు కారణాల వల్లే ఇన్నాళ్లు ఎక్కువగా సీఎన్జీ, హైబ్రిడ్ కార్లపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కానీ తమకు పోటినిచ్చే కంపెనీలు ప్రస్తుతం ఎలక్టివలక్ కార్ల మీద ఫోకస్ చేయడంతో మారుతీ సుజుకీ కూడా ఈ తయారీ రంగంలోకి దిగక తప్పలేదు. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియమ్ తో కలిసి టాటా పవర్ ఒప్పందం చేసుకుంది.