Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ పెట్టుకున్న మాస్కు.. పార్లమెంటులో హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   9 March 2021 4:30 AM GMT
ఆ ఎంపీ పెట్టుకున్న మాస్కు.. పార్లమెంటులో హాట్ టాపిక్ గా మారింది
X
కరోనాకు ముందు వరకు మాస్క్ అంటే లైట్ తీసుకునేవారు. అలాంటిది కరోనాపుణ్యమా అని మాస్కు లేకుండా బయటకు వెళ్లేవారు తక్కువమంది ఉంటున్నారు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో.. మాస్క్ చాలా ముఖ్యమైనదిగా మారింది. అయితే.. మార్కెట్లో లభించే మాస్కుల్లో ఎంతమేర నాణ్యమైనవని.. కరోనా వైరస్ బారిన పడకుండా నిలుపుతాయన్నది పెద్ద ప్రశ్నే. ఇలాంటివేళ.. రాజ్యసభ సభ్యుడు ఒకరు పెట్టుకున్న మాస్కు.. పార్లమెంటులో హాట్ టాపిక్ గా మారింది.

వ్యోమోగామి ధరించినట్లుగా ఉన్న మాస్కు పెట్టుకొని రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ హాజరయ్యారు.చిన్నసైజు హెల్మెట్ మాదిరి ఉన్న ఈ మాస్కు గురించి పలువురు ఎంపీలు అడిగి తెలుసుకున్నారు. దాని ప్రత్యేకత ఏమిటంటూ వారు అడగటం కనిపించింది. ఈ సందర్భంగా నరేంద్ర జాదవ్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను ధరించిన మాస్కు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూపొందించినట్లుగా పేర్కొర్నారు.

ఈ మాస్కు కారణంగా 99.07 శాతం శుద్ధమైన ఆక్సిజన్ ను పొందే వీలుందని చెప్పారు. స్వతహాగా ఇంజినీర్ అయిన విశ్వేశ్వర్ రెడ్డి కరోనా కాలంలో పలు రకాలైన మాస్కుల్ని.. శానిటైజర్లను పలువురు రోగులకు అందజేశారు. ప్రత్యేకమైన వెంటిలేటర్లను కూడా రూపొందించారు. ఆయన రూపొందించిన హెల్మెట్ లాంటి మాస్కు పార్లమెంటు లోని పలువురు నేతలు ఆసక్తిగా చూశారు.