Begin typing your search above and press return to search.
మంత్రికి టీకా వేశారు.. సస్పెండ్ అయిన వైద్యాధికారి
By: Tupaki Desk | 3 April 2021 5:30 PM GMTఅధికారం చేతిలో ఉంటే నేతలు ఎంతలా చెలరేగిపోతారో తెలిసిందే. అలాంటి వారి దెబ్బకు అధికారులు కిక్కురుమనకుండా వారు చెప్పింది చేయాలి. లేదంటే.. మొదటికే మోసం వస్తుంది.అలా అని మంత్రిగారి మాట విని.. వారు చెప్పినట్లు చేస్తే.. ఉద్యోగానికి ఎసరు వస్తుంది. ఇలాంటి చిక్కులు చాలామందికి ఎదురవుతుంటాయి. అలాంటి ఇబ్బందే కర్ణాటకకు చెందిన ఒక వైద్యాధికారికి ఎదురైంది. ఒత్తిడి తట్టుకోలేక ఓకే అన్న పాపానికి ఉద్యోగానికే ఎసరొచ్చింది. ఇంతకూ ఆయన చేసిన పని.. మంత్రికి టీకా వేయటం.
కరోనా వ్యాక్సిన్ వేస్తే.. అధికారిపై చర్యలు తీసుకుంటారా? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. టీకా వేసింది ఆయన ఇంట్లో. కరోనా వ్యాక్సిన్ నిబంధనల ప్రకారం.. ఎవరైనా సరే ఆసుపత్రికో.. లేదంటే వ్యాక్సిన్ కేంద్రాల్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ కారణంతోనే దేశ ప్రధాని మోడీ పొద్దుపొద్దున్నే ఎయిమ్స్ కు వెళ్లి టీకా వేయించుకోవటం తెలిసిందే. కానీ.. అదే పార్టీకి చెందిన కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
తనకు.. తన భార్యకు ఇంటికే వచ్చి ఓటు వేయాలని ఆర్డర్ వేశారు. మంత్రిగారి మాటల్ని కాదనలేని వైద్యాధికారి జెడ్.ఆర్. మకాందార్ సూచనతో సిబ్బంది కరోనా వ్యాక్సిన్ కిట్ ను తీసుకొని మంత్రి ఇంటికి వెళ్లి ఆయనకు.. ఆయన సతీమణికి టీకా వేశారు. ఈ విషయం మీడియాలో రావటం.. అది కాస్తా రచ్చగా మారటం జరిగిపోయాయి. కోవిడ్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంపై విమర్శలు రావటంతో.. వైద్యాధికారిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తప్పు చేసిన వైద్యాధికారిపై వేటు వేయటం సబబే. ఎందుకంటే.. అధికారానికి లొంగిపోయి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం ముమ్మాటికి తప్పే. కానీ.. తప్పు చేసేందుకు తన అధికారాన్ని ప్రదర్శించిన మంత్రిని వదిలేయటం మాత్రం సబబు కాదని చెప్పాలి. ఎందుకంటే.. వైద్యాధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటున్నప్పుడు.. దానికి కారణమైన మంత్రిని ఎందుకు వదిలేయాలన్నది ప్రశ్న. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే.. ఇలాంటి ఉదంతాలకు చెక్ పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.