Begin typing your search above and press return to search.
సబితకు చేదు అనుభవం
By: Tupaki Desk | 23 Oct 2020 4:00 PM GMTమంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించటంతో పాటు నష్టపరిహారం చెల్లించేందుకు వెళ్ళిన మంత్రిని స్ధానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు, నేతలు చెప్పిన వాళ్ళకు మాత్రమే అందుతోందంటూ బాగా మండిపడ్డారు.
మంత్రి ఏదో చెప్పబోతే కూడా స్ధానికులు వినకుండా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. దాంతో ఏమి చేయాలో తోచని మంత్రి చేసేది లేక చివరకు పరామర్శలకు స్వస్ధిపలికి, చెక్కులను కూడా పంపిణీ చేయకుండానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇది సబితకు చెందిన రెండో అవమానంగానే చూడలి. ఎందుకంటే ఈమధ్యనే సబిత కాన్వాయ్ ను కూడా స్ధానికులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే.