Begin typing your search above and press return to search.

జర్మనీలో ఉప్పుతో కరోనా వ్యాప్తి ప్రారంభం..ఎలా జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   12 April 2020 12:30 AM GMT
జర్మనీలో ఉప్పుతో కరోనా వ్యాప్తి ప్రారంభం..ఎలా జరిగిందంటే ?
X
కరోనా మహమ్మారి చైనా లో వెలుగు లోకి వచ్చి , ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరించింది. అయితే , కొన్ని దేశాలు అసలు తమ దేశంలో కరోనా ఎలా వ్యాపించింది ..ఎక్కడ వ్యాప్తి చెందటం ప్రారంభించింది అనే విషయాలని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే , ఇందులో జర్మనీ సక్సెస్ అయ్యింది అని చెప్పవచ్చు. జర్మనీ లో కరోనా వ్యాప్తి , ఎలా , ఎక్కడ ప్రారంభమైందో బయట పడింది. జర్మనీలో ఒక ఉప్పు ద్వారా తొలిసారిగా కరోనా ఒకరి నుండి మరోకరి వ్యాప్తి చెందింది. ఉప్పు డబ్బా ద్వారా కరోనా వ్యాప్తా? ఎలా అని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చూద్దాం..

మనుషుల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందో జర్మనీ క్రమ పద్ధతిలో తెలుసుకుంది. తొలిసారిగా కరోనా వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది ..జర్మనీ పట్టణం Stockdort. మ్యూనిచ్ కు దగ్గర. కార్ల పార్ట్స్ విడిభాగాలను తయారు చేసే Webasto Group లో పని చేస్తున్నారు. అందులో పనిచేసే ఓ చైనా అమ్మాయి, వైరస్ ను Webasto Group హెడ్ క్వార్టర్స్ కు తీసుకొచ్చింది. అక్కడ నుంచి తొటివారికి అంటించింది. అందులో మొదటి వ్యక్తి... ఆమెను సాల్ట్ ను అడిగిన ఓ వర్కర్. సైంటిస్ట్ లు ఇక్కడ నుంచి ఎవరు ఎవరిని కలిశారో అని తెలుసుకుంటూ, కరోనా వచ్చిన, రావడానికి అవకాశమున్న అందరినీ కనిపెట్టింది.

వాళ్లందరికి కరోనా పరీక్షలు నిర్వహించింది. జర్మనీ కరోనా పై పట్టు సాధించడానికి ఇది చాలా ఉపయోగపడింది. అలాగే వేలాదిమంది ప్రాణాలు పోకుండా ఆపగలిగింది. అయితే, ఒక పద్దతి ప్రకారం తోలి కేసు నుండి ఒక్కొక్కరిని వెలుగులోకి తెచ్చి, కరోనాను అడ్డుకోగలిగింది. కానీ , ఇటలీ మాత్రం ఇంకా కరోనా తో కొట్టుమిట్టాడుతోంది. జర్మనీ లో ఇంతవరకు 2,100 మంది చనిపోతే, ఆ తర్వాత కరోనా వచ్చిన ఇటలీలో మరణాలు 18వేల వరకు ఉన్నాయి.