Begin typing your search above and press return to search.

భారత శాస్త్రవేత్తల అద్భుతం .. మూడు బ్లాక్‌హోల్స్‌ విలీనం

By:  Tupaki Desk   |   27 Aug 2021 1:30 PM GMT
భారత శాస్త్రవేత్తల అద్భుతం .. మూడు బ్లాక్‌హోల్స్‌ విలీనం
X
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటివరకు ఎవరూ కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ బ్లాక్‌ హోల్స్‌ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఇక్కడ, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత్‌ కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం విశేషం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్‌ హోల్స్‌(Black Holes)ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు, మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ఆస్రోనమీ జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు.

మూడో పాలపుంత ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్‌ జీసీ7733ఎన్‌.. అనేది ఎన్‌ జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి అని తెలిపారు. గెలాక్సీ జంట.. ఎన్‌ జీసీ7733ఎన్‌-ఎన్‌ జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి,శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా, పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌ హోల్‌ లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ కు చెందిన జ్యోతి యాదవ్‌, మౌసుమి దాస్‌, సుధాన్షు బార్వే, ఆస్ట్రోసాట్‌ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ సాయంతో వీటిని వీక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ ఎస్‌ ఎఫ్‌, చిలీ వీఎల్‌ టీ, యూరోపియన్‌ యూనియన్‌ కు చెందిన ఎంయూఎస్‌ ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్‌ ఆల్ఫా ఫోటోలని సైతం విడుదల చేశారు.