Begin typing your search above and press return to search.
మోడీ వచ్చే.. బీఎస్ ఎన్ ఎల్ - రైల్వేస్.. ఇప్పుడు ఎల్ ఐసీ పాయే..!
By: Tupaki Desk | 14 Aug 2020 10:50 AM GMTఅన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్లకు, ప్రైవేటుకు దోచిపెడుతుందన్న అపవాదును మూటగట్టుకుంటోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే భద్రత, రక్షణ, ఉద్యోగ, ఉపాధికి గ్యారెంటీ ఉంటుంది. అదే ప్రైవేటుకిస్తే వారికి దోచిపెట్టడమే.. ఉద్యోగ, ఉపాధి ఊసురు పోసుకోవడమే.. ఇప్పుడు అన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ మోడీ సర్కార్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోందన్న విమర్శలు సగటు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
దేశ పరిశ్రమల్లో నవరత్నాలలో ఒకటైన బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎలా కూలిపోయిందో చూస్తున్నాం. దాన్ని ప్రైవేటు పరం చేసిన మోడీ ఆ తర్వాత రైల్వేలలోనూ ప్రైవేటును ప్రోత్సహించి తలుపులు బార్లా తెరిచారు.
ఇప్పుడు అక్కడితో ఆగికుండా ప్రభుత్వం జీవిత భీమా సంస్థ.. కోట్ల టర్నోవర్ కలిగిన ఎల్ఐసీపై మోడీ సర్కార్ కన్ను పడింది. ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయడానికి మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది.
ఇవన్నీ ఎంతో గొప్ప గొప్ప సంస్థలు. సరిగా నడిపిస్తే దేశాన్ని ఏలగలవు. కానీ కొన్ని కార్పొరేట్ శక్తులకు తలొగ్గి మోడీ ప్రభుత్వ వ్యవస్థలను నీరుగారుస్తున్నారన్న ఆవేదన ఆయా సంస్థల ఉద్యోగుల్లో నెలకొంది. మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మోడీ ప్రభుత్వ హయాంలో పతనమవుతోంది. ఆర్థికవ్యవస్థతోనే ఆగలేదు. ఈ దేశాన్ని మానసికంగా ముక్కలు చేసేశారు మన మోడీ సార్..