Begin typing your search above and press return to search.
సబ్సిడీ నిల్.. బండ బాదుడే..మోడీనా మజాకానా?
By: Tupaki Desk | 5 Feb 2021 2:30 PM GMTప్రశాంతంగా కనిపించటమే కాదు.. మాటల్నిచాలా ఓర్పుతో చెప్పే ప్రధాని మోడీ మాష్టారి చేతలు మాత్రం చాలా కరకుగా ఉంటాయి. పెట్రోల్.. డీజిల్ ధరల బాదుడు ఇందుకో ఉదాహరణ. చూస్తుండగానే లీటరు పెట్రోల్ ధర రూ.90 దాటిపోతే.. లీటరు డీజిల్ ధర రూ.82ను దాటేసి చాలాకాలమే అయ్యింది. మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి.. ఇప్పటికి లీటరు పెట్రోల్.. డీజిల్ లో వచ్చిన ధరల తేడా సామాన్య.. మధ్యతరగతి జీవుల బడ్జెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది.. సరిపోనట్లు తాజాగా వంటగ్యాస్ విషయంలో మోడీ మార్కు మొదలైంది. ఇంతకాలం సబ్సిడీ ఇస్తున్న మొత్తాన్ని క్రమపద్దతిలో తగ్గించేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తంగా గుండు సున్నా పెట్టేసే వరకు వచ్చింది.
వంటింట్లో బండ బాదుడుకు తెర తీసిన కేంద్రం తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. గడిచిన తొమ్మిది నెలల వ్యవధిలో సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతూ.. సగటు జీవికి భారంగా మారింది. 2019 మేలో సబ్సిడీ కింద అందిన మొత్తం రూ.263 ఉంటే.. జనవరి 2021 నాటికి రూ.40 తగ్గిన వైనం చూస్తే.. భారం ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. గతంలో సిలిండర్ ధర ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా.. అందులో ఉండే సబ్సిడీ కారణంగా.. వినియోగదారుడికి పడే భారం తక్కువగా ఉండేది. ఇది మరింత ఈజీగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణను చూస్తే అర్థమవుతుంది.
2020 ఫిబ్రవరిలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.917గా ఉండేది. కాకుంటే.. అప్పట్లో వినియోగదారుడికి సబ్సిడీ కింద రూ.450 వచ్చేది. దీంతో.. వినియోగదారుడు రూ.467 మాత్రమే చెల్లించాల్సి ఉండేది. తాజాగా చూస్తే.. సిలిండర్ రూ.746 ఉండగా.. దాని మీద వస్తున్న సబ్సిడీ రూ.40కే పరిమితమవుతోంది. ఇక్కడ పేర్కొంటున్న అంకెలు సరిగ్గా.. అందరికి ఇలానే ఉంటుందని చెప్పలేం. రెండు తెలుగురాష్ట్రాల్లో కాస్త తేడా ఉండొచ్చు. కానీ.. మొత్తంగా చూస్తే.. గ్యాస్ బండ మీద కేంద్రం ఇచ్చే సబ్సిడీలో భారీ కోత పడిందన్న వాస్తవం. ఇలా ఒక్కొక్కటిగా సబ్సిడీల్ని కట్ చేస్తున్న మోడీ సర్కారు.. అందుకు తగ్గట్లు మౌలిక వసతుల్ని భారీగా పెంచినా ఫర్లేదు. కానీ.. అవేమీ కనిపించటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.