Begin typing your search above and press return to search.
మూడ్ మారుతోంది జగన్... ?
By: Tupaki Desk | 1 Nov 2021 5:30 PM GMTఅవును మూడ్ మారుతోంది. ఏపీలో జనాల మూడ్ చేంజ్ అవుతోంది. అది అందరికీ అర్ధం అవుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం తెలుసో తెలియదో అన్న మాట ఉంది. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు వైసీపీ హై కమాండ్ దృష్టికి చేరవేసే సీన్ ఉందో లేదో తెలియదు. అందుకే ప్రజలతో సంబంధం లేకుండానే కొన్ని కీలక విషయాల్లో పాలన సాగుతోంది అన్న కామెంట్స్ పడుతున్నాయి. ఇక జగన్ అధికారంలోకి రావడంతోనే మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. దాంతో రాష్ట్రంలో మూడు వైపుల నుంచి రాజకీయ వేడి రాజుకుంది. అమరావతిని ఏకైక రాజధాని చేయాలని ఒక వైపు టీడీపీ ఇతర ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వైసీపీ మాత్రం మూడు చోట్లా అభివృద్ధీ అంటూ విపక్షానికి చెక్ పెట్టడానికి చూసింది.
అదే విధంగా దూకుడు చేసి మరీ మూడు రాజధానుల విషయంలో చట్టాన్ని చేసింది. అదిపుడు న్యాయ సమీక్షలో ఉంది. తీర్పు రావడానికి ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే అమరావతిలో గత ఏడాది కాలంగా రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అది ఇపుడు మరో రూపు సంతరించుకుంది. అమరావతి నుంచి తిరుపతి దాకా మహా పాదయాత్ర పేరిట భారీ ఆందోళనకు ఉద్యమకారులు తెర తీశారు. ఒక విధంగా ఏపీ రాజకీయాల్లో ఇది కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. ఇప్పటిదాక అమరావతి రాజధాని రైతుల ఉద్యమాన్ని కేవలం 29 గ్రామాల సమస్యగానే చూపెట్టారు. వారు కనుక అన్ని జిల్లాలూ దాటి మహా పాదయాత్ర పూర్తి చేస్తే మిగిలిన ప్రాంతాలలో కూడా ఆ సెంటిమెంట్ బాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఇక మహా పాదయాత్రకు ఇది సరైన ముహూర్తం అని అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో గతంలో అటు రాయలసీమవాసులు, ఇటు ఉత్తరాంధ్రా వాసులు ఆశలు పెట్టుకున్నారు. కర్నూల్ కి న్యాయ రాజధాని అని విశాఖకు పాలనా రాజధాని అని జగన్ సర్కార్ పేర్కొంది. దాంతో తమ ప్రాంతాలూ అభివృద్ధి సాధిస్తాయి అని అక్కడి ప్రజలు బాగానే ఊహించారు. రాను రానూ పరిణామాలు మారిపోతున్నాయి. తమ ప్రాంతాలకు రాజధానులు వస్తాయన్న వస్తాయన్న నమ్మకం కూడా మెల్లగా సన్నగిల్లుతోంది. దీంతో గతంలో మాదిరిగా అమరావతి ఏకైక రాజధాని అంటే దాని మీద వ్యతిరేకత చూపించే అవకాశం అయితే ఇటు వైపు లేదు.
అదే సమయంలో ఏపీలో ఆర్ధిక వనరులు లేకపోవడం, మూడు కాదు అసలు ఒక్క రాజధాని అయినా ఏపీకి ఉందా అన్న ప్రశ్నకు జవాబు దొరకకపోవడంతో జనాల ఆలోచనల్లో మార్పు వస్తోంది అంటున్నారు. ఏదో ఒక రాజధాని ఉంటే అది కేంద్రంగా ఈ పాటికి అభివృద్ధి చెందేవారమన్న భావన బలపడుతోంది. ఇక ప్రభుత్వం సైడ్ నుంచి మూడు రాజధానుల కోసం ఏ రకమైన కదలిక లేదు, కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని గతంలో మాదిరిగా మంత్రులు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇలా మూడు రాజధానుల విషయంలో జనం మూడ్ మారుతోండగా అమరావతికి అదే బలంగా ఉంది. దాంతో సరైన టైమ్ చూసుకుని మరీ మొత్తం ఏపీ మద్దతు కూడగట్టడానికి మహా పాదయాత్రను చేపడుతున్నారు. ఇది కనుక విజయవంతం అయితే విపక్షానికి నైతిక మద్దతు దక్కినట్లే. అదే టైమ్ లో జగన్ సర్కార్ వైఫల్యం కూడా బయటపడినట్లే.