Begin typing your search above and press return to search.

జాగా లేక ఆసుపత్రి బయటే సంచుల్లో శవాల గుట్టలు

By:  Tupaki Desk   |   13 April 2021 3:44 AM GMT
జాగా లేక ఆసుపత్రి బయటే సంచుల్లో శవాల గుట్టలు
X
భారీగా పెరిగిన కేసులకు తగ్గట్లే.. మరణాల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. రోజువారీ విడుదల చేస్తున్న రిపోర్టుల్లోనూ కొద్ది రోజులుగా మరణాల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో.. మార్చురీలు నిండిపోతున్నాయి. పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న మరణాలు.. పలు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ రాయ్ పుర్ లోని పెద్దాసుపత్రి పరిస్థితి తెలిస్తే.. మరీ ఇలాంటి పరిస్థితి ఉందా? అని విస్మయానికి గురి కాక మానరు.

రాయ్ ఫుర్ లోని అతి పెద్ద ఆసుపత్రి అయిన డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న కేసుల్లో మరణాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య రీతిలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. దీంతో.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నట్లు చెబుతుున్నారు. రోజువారీగా చోటు చేసుకునే మరణాల కంటే పది రెట్లు ఎక్కువగా ఉండటంతో మార్చురీలు సరిపోవటం లేదు.

దీంతో.. శవాల్ని ఎక్కడ ఉంచాలో అర్థం కాని పరిస్థితి. ఫ్రీజర్లు సరిపోని దుస్థితి. శ్మశాన వాటికలు సరిపోవటం లేదు. అంత్యక్రియకుల వెళుతున్న వాటి కంటే.. ఎక్కువ మార్చురీకి వస్తున్నాయి. దీంతో.. అంత్యక్రియులు చేయలేని పరిస్థితి నెలకొంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. శవాల్ని మార్చురీ నిండిపోవటంతో.. సంచుల్లో కుట్టేసి.. ఆసుపత్రి ఆరు బయట ఉంచుతున్నారు. తమకు ఏం చేయాలో అర్థం కావటం లేదని.. భారీగా చోటు చేసుకుంటున్న మరణాలతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది. ఇదంతా చూస్తే.. దేశంలో విస్తరిస్తున్న మహమ్మారి తీవ్రత ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.