Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ దేశాలివేనట

By:  Tupaki Desk   |   2 March 2017 9:54 AM GMT
ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ దేశాలివేనట
X
గతంలో వేళ్ల మీద లెక్క పెట్టే దేశాలు మినహా మిగిలిన దేశాలకు వెళ్లాలంటే పెద్ద ఇబ్బందులు ఉండేవి కావు. కానీ.. మారిన ప్రపంచ పరిణామాలతో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. పెరిగిన తీవ్రవాద కార్యకలాపాల కారణంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తీవ్రవాదులు విరుచుకుపడతారో తెలీని పరిస్థితి. శాంతికి కేరాఫ్ అడ్రస్ గా అనుకునే యూరప్ లో పరిస్థితులు ఇప్పుడెలా తయారయ్యాయో తెలిసిందే.

ఇలా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదుల విద్రోహ చర్యల కారణంగా శాంతి అన్నది బ్రహ్మపదార్థంగా మారిపోయింది. విదేశీ పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులకు తెగబడుతున్న వైనం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను ప్రాతిపదికగా తీసుకొని.. తాజాగా ఒక జాబితాను సిద్ధం చేశారు. ఇందులో 32 దేశాల్ని పర్యాటకులు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

పర్యాటకులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా చెబుతున్న ఈ 32దేశాల్ని ఆయా దేశాల్లోని పరిస్థితులు.. నేర తీవ్రత ఆధారంగా ఎంపిక చేశారు. ఆయా దేశాల్లోని స్థానిక అంశాలతో పాటు.. తీవ్రవాద కార్యకలాపాల్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పర్యాటకులు ఏ మాత్రం వెళ్లకూడని దేశాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్.. లిబియా.. దక్షిణ సూడాన్.. సిరియా.. యమెన్ దేశాలతోపాటు.. ఆఫ్ఘనిస్థాన్.. పాకిస్థాన్.. ఈజిప్ట్.. జార్జియా.. ఇరాక్.. ఇజ్రాయల్.. ఇరాన్.. మాలి.. ఫిలిప్పీన్స్ తదితర దేశాలు ఉన్నాయి. సో.. బీకేర్ ఫుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/