Begin typing your search above and press return to search.

1100 కోట్లకు అమ్ముడుపోయిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు

By:  Tupaki Desk   |   20 May 2022 12:30 PM GMT
1100 కోట్లకు అమ్ముడుపోయిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు
X
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏంటో తెలుసా? ఇది 1955 మెర్సిడేజ్-బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే కారు. అమెరికాలో జరిగిన వేలంలో ఈ బెంజ్ కారు 143 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,100 కోట్లు) భారీ మొత్తానికి విక్రయించబడింది.

బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్ రహస్యంగా ఒక పేరులేని క్లయింట్ తరపున వేలం వేశారు. ఈ పాతకాలపు కూపేకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

1955లో నిర్మించబడిన మెర్సిడెస్-బెంజ్ కంపెనీ రేసింగ్ డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు తయారు చేసిన రెండు నమూనాలలో ఒకటి. ఉహ్లెన్‌హాట్ కూపే అనే పేరు దాని చీఫ్ ఇంజనీర్ రుడాల్ఫ్ ఉహ్లెన్‌హాట్‌ ద్వారా పెట్టారు..

జువాన్ మాన్యుయెల్ ఫాంగియో ఈ గ్రాండ్ ప్రిక్స్ కారుపై నడపడం ద్వారా రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. కారు స్పోర్ట్స్ రేసింగ్ కోసం శక్తివంతమైన 3.0-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

కెనడియన్ క్లాసిక్ కార్ వేలం కంపెనీ అధినేత ఆర్ఎం సోత్ బై మే 5న మెర్సిడెస్-బెంజ్ స్టట్‌గార్ట్ కారును భారీ ధరకు కొన్నారు. వేలంలో సేకరించిన మొత్తం యువతకు పర్యావరణ శాస్త్రం - డీకార్బనైజేషన్ రంగాలలో విద్యా మరియు పరిశోధన స్కాలర్‌షిప్‌లను అందించడానికి ఉపయోగించబడుతుంది.