Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఖరీదైన చేప.. బంగారం కంటే ఎక్కువ ధర..!

By:  Tupaki Desk   |   17 May 2021 5:32 AM GMT
ప్రపంచంలోనే ఖరీదైన చేప.. బంగారం కంటే ఎక్కువ ధర..!
X
చేపల కూర చాలా మందికి ప్రియమైన ఆహారం.. మనదేశంలో చాలా మంది చేపలను ఇష్టపడుతుంటారు. అయితే చేపల్లో కొన్ని వందల రకాలుంటాయి. వాటి ధరల్లోనూ తేడాలు ఉంటాయి. ఇదిలా ఉంటే జపాన్​లో దొరికే ఓ చేప మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది. దీని ధర బంగారం కంటే ఎక్కువ. ఇంతకీ ఆ చేప .. ప్రత్యేకతలు ఏమిటి? దానికి ఎందుకు ధర అంతంటే..

జపాన్​ ప్రజలు సీ ఫుడ్​ ను ఎంతో ఇష్ట పడుతుంటారు. అక్కడి మార్కెట్ లో రకరకలా చేపలు ఉంటాయి. వీటిలో ఈల్​ ఫిష్​ మాత్రం ఎంతో ప్రత్యేకం. దీని ధర కిలోకు 35 వేల డాలర్లు. జపాన్​ లో బంగారం ధర కూడా అంతే ఉంది. అయితే ఈ చేప ఎందుకంత ప్రత్యేకం అంటే దీన్ని కేవలం మంచి నీటి లో మాత్రమే పెంచుతారు. జపాన్​ ప్రజలు ఈ చేపలను ఎంతో ఇష్ట పడతారు. ఒక్క జపాన్​ లో సంవత్సరానికి సుమారు 50 టన్నుల ఈల్​ చేపలు అమ్ముడవుతాయి. అక్కడి హోటల్స్​, రెస్టారెంట్ల లో ఈల్​ చేపలతో తయారు చేసిన పదార్థాలకు ఎంతో గిరాకీ ఉంటుంది.

1980కి ముందు ఈల్​ చేపలకు పెద్దగా గిరాకీ ఉండేది కాదు. కానీ ఆ తర్వాత వీటి సంఖ్య 75 శాతం పడిపోయింది.దీంతో ఈ చేపలకు ప్రస్తుతం గిరాకీ పెరిగింది. అంతేకాక ఈల్​ చేపల పెంపకం ఎంతో కష్టతరమైందని నిర్వాహకులు చెబుతుంటారు. ఈల్​ చేప పిల్లలను కేవలం మంచి నీటి సరస్సు లో మాత్రమే పెంచాలి.

పశుగ్రాసం, గోధుమలు, సోయాబీన్, చేప నూనె వంటి పదార్థాలను ఆహారంగా ఇస్తారు. ఇందుకోసం భారీగా ఖర్చవుతుంది. దీంతో ఈ చేపలకు గిరాకీ పెరుగుతోంది. మరోవైపు ఈల్​ చేపల కట్టింగ్​ కూడా ఎంతో కష్టతరం. ఈ పద్ధతిని తయారుచేసే పద్ధతిని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అంటారు. వెరసి ఈల్​ చేపలకు డిమాండ్ పెరిగింది.