Begin typing your search above and press return to search.

అమెరికాలో కనీస ఉపాధి లేని పట్టణం ఇదేనట..

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:04 AM GMT
అమెరికాలో కనీస ఉపాధి లేని పట్టణం ఇదేనట..
X
అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. కానీ అలాంటి దేశంలో కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్న ఓ పట్టణం ఉంది. తలసరి ఆదాయం దీన స్థితిలో ఉండడంతో ఇక్కడి పౌరులు కనీస ఆహారం లేక అలమటిస్తున్నాయి. అమెరికా -మెక్సికో దేశాల సరిహద్దులో ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని ఇస్కోబారెస్‌ అనే పట్టణంలో వెయ్యికి పైగా జనాభా ఉన్నారు. అమెరికాలో 1000కు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో పేదరికం అత్యధికంగా ఉన్న పట్టణం ఇస్కోబారెస్ అని అమెరికా ప్రభుత్వం తాజా అధికారిక లెక్కల్లో పేర్కొంది. ఈ పట్టణంలో 62 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దీంతో అమెరికాలోని అత్యంత పేదరిక పట్టణంగా ఇస్కో బారెస్‌ పేరొందింది.

'చెత్త వేరడం నేను చిన్న పనిగా భావించడం లేదు.. ఇదే నాకు పెద్ద ఉపాధి' అని ఓ అమెరికన్ నిరుద్యోగ యువకుడు పారిశుధ్య కార్మికుడిగా కూడా చేరడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఈ పట్టణంలో ఇలాంటి పరిస్థితి రావడానికి ఉపాధి లేకపోవడమే కారణమంటున్నారు. ఉపాధి అవకాశాలు లేక తామంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నామని మెజార్టీ నిరుద్యోగులు చెబుతున్నారు.. అలాగే భవిష్యత్తుపై తమకు ఎలాంటి ఆలోచన లేదని పేర్కొంది.

అలాగే ఇక్కడ నేరాలు కూడా ఎక్కువే. మెక్సికోకు సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణం మాఫియాకు కేంద్రంగా ఉంది. ఒకరినొకరు హత్య చేసుకోవడం కామన్‌ గా జరుగుతుంటుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో తలసరి ఆదాయం కంటే నేరాల శాతం ఎక్కువగా పెరుగుతుందని అంటున్నారు. ఒకప్పుడు ఈ పట్టణం దేశాల సరిహద్దుగా ఉండేది కాదు.

2005లో ఇస్కోబారెస్‌ కు పేదరిక పట్టణంగా తొలి గుర్తింపు వచ్చింది. మెక్సికో దేశ ప్రాబల్యం కారణంగా ఈ పట్టణంపై ఆంక్షలు పెరిగాయి. ఇరుదేశాల మధ్య పెట్టే ఆంక్షలతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ మేయర్‌ రూపర్టో వివరించారు. పట్టణానికి గుర్తింపు వచ్చినా పెద్దగా అభివృద్ధి సాధించిందేమీ లేదని తెలిపారు.