Begin typing your search above and press return to search.
ఉద్యమం: లక్షద్వీప్ ను ముంచేస్తారా?
By: Tupaki Desk | 14 Jun 2021 5:30 PM GMTసేవ్ లక్షద్వీప్, గో బ్యాక్ ప్రపుల్ నినాదాలతో భారత కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మారుమోగిపోతోంది. ఆరేబియా సముద్రంలో ఈ ద్వీప ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయాలపై అక్కడి ప్రజలు పోరుబాట పట్టారు. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశ ద్రోహం కేసులు పెట్టినా వెనక్కితగ్గమంటున్నారు.దీంతో అసలు లక్షద్వీప్ లో ఏం జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ 2020 డిసెంబర్ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ రోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో కేంద్రప్రభుత్వం దాద్రానగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన గుజరాత్ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ఇప్పుడు లక్షద్వీప్ ను మాల్దీవుల్లా మార్చేస్తానంటూ అభివృద్ధి పనులు మొదలుపెట్టాడు. ఆయన నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 'ఎల్.డీ.ఏఆర్' సంక్షోభంలోకి నెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్షద్వీప్ లో స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హైప్రొఫైల్ బీచ్ ఫ్రంట్ లు నిర్మిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఉన్న ద్వీపం కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతోందన్న ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇక లక్షద్వీప్ ఆందోళనకు కేరళ సీఎం మద్దతు ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం లక్షద్వీప్ ప్రజలకు మద్దతు పలికారు. దీంతో స్థానికుల ఆందోళన పతాక స్థాయికి చేరింది. తాజాగా సముద్రంలో మునిగి అక్కడి వారు నిరసన తెలిపారు.
ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నాడు ప్రఫుల్ పటేల్. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్ లో ఆయన పర్యటించనున్నారు.
- ప్రఫుల్ పటేల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలివీ
లక్షద్వీప్ లో ముస్లిం జనాభా ఎక్కువ. ఇక్కడ గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదని ప్రఫుల్ పటేల్ నిషేధించారు. అందరూ మాంసాహారులైనా జంతువధను, బీఫ్ ను నిషేధించడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10వేల జరిమానా విధిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా వాటిని అడ్మినిస్ర్టేటర్ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. నేరాల సంఖ్య తక్కువ. అయినా గూండా చట్టాన్ని ప్రయోగించారు. మద్య నిషేధం అమల్లో ఉన్నా పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. 2019లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు అతికించారన్న కారణంతో కేసులు పెట్టించారు.