Begin typing your search above and press return to search.
`సర్వే` మర్మం.. ఇదేనా?
By: Tupaki Desk | 31 July 2022 3:30 AM GMTఅన్ని సర్వేలు వాస్తవాలు కాదన్నట్టుగానే... ఇప్పుడు తాజాగా ఇండియా టీవీ.. చేసిన సర్వే.. తాలూకు ఫలి తం కూడా అంతే అంటున్నారు పరిశీలకులు. ఈ సర్వే వ్యూహాత్మకం. ఉద్దేశ పూర్వకంగానే చెబుతున్నారు. మరో రెండు సంవత్సరాల తర్వాత.. లేదా.. రెండేళ్లలోపు.. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరగనుం ది.
అప్పటి ఫలితాన్ని ఇప్పుడే ప్రెడిక్ట్‌చేయడం.. సర్వేల లక్షణం. అయితే.. ఈ సర్వేల పరమార్థం ఏంటం టే.. అధికార పక్షాలు తీసుకునే చర్యలు-వాటిపై ప్రజల అంతరంగం వంటివి స్పృశించాలి.
తద్వారా.. ప్రజల విషయంలో ప్రభుత్వ పార్టీలను అలెర్ట్ చేయడం.. దూకుడు నిర్ణయాలకు కళ్లె వేయడం.. అనే విషయం.. ఇలాంటి సర్వేల వెనుక దాగి ఉండాలి. ఉండేది కూడా! కానీ.. తాజాగా సర్వేలో మాత్రం ఈ ప్రజాప్రయోజన సూత్రం ఎక్కడా కనిపించలేదు. జీఎస్టీ పెంచారు.. పెట్రోల్ ధరల మోత మోగుతోంది. ఉపాధి లేదు.. దేశంలో బ్యాంకులు దివాలాతీస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రాలు అప్పుల కుప్పులుగా మారుతున్నాయి.
వీటన్నింటి.. `మూల కారణంబెవ్వడు` అంటే.. అందరి వేళ్లూ.. ఢిల్లీవైపు చూపిస్తున్నాయి. మరి .. ఇంతగా సెగ పుడుతున్నా.. సర్వే మాత్రం.. సర్వం.. మోడీ భజనలో మునిగితేలడమే.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ సర్వే మర్మం.. కేవలం.. తమపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకోవడం.. కోసం.. కేంద్రం పెద్దలు ఆడిన నాటకంగానే ఆర్థిక, రాజకీయ నిపుణులు నిర్మొహమాటంగా.. కుండబద్దలు కొడుతున్నారు.
``ఎక్కడైనా.. రెండు సార్లు పాలించిన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. పైగా.. ద్రవ్యోల్బణంతో అల్లాడు తున్న భారత్‌లో.. మోడీ పాలనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఆర్థికమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారనే చర్చకూడా జరుగుతోంది.
అయినా.. ఆయన పాలనకు మంచి మార్కులు పడ్డాయంటే.. ఆలోచించాల్సిందే`` అని మద్రాస్‌కు చెందిన కీలక రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా ముందస్తు వ్యూహంలోభాగంగానే చూడాల్సి ఉంటుందని.. ఆయన పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా.. సర్వేల మర్మం.. ఎలా ఉన్నా.. ప్రజల నాడిని అయితే.. మార్చడం ఎవరి తరమూ కాదుకదా!! అంటున్నారు పరిశీలకులు.