Begin typing your search above and press return to search.

పోల‌వ‌రానికీ పేరు... టీడీపీకి వైసీపీ కౌంట‌ర్‌..!

By:  Tupaki Desk   |   26 Sep 2022 5:10 AM GMT
పోల‌వ‌రానికీ పేరు... టీడీపీకి వైసీపీ కౌంట‌ర్‌..!
X
రాష్ట్రంలో సంస్థ‌ల‌కు పేర్లు మార్పు యుద్ధం కొన‌సాగుతోంది. హెల్త్ యూనివ‌ర్సిటీకి.. ఎన్టీఆర్ పేరు తీసేసి .. వైఎస్సార్ పేరు పెట్టిన విష‌యంపై తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేగింది. టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, ఎన్టీఆర్ కుటుంబం కూడా.. ఇలానే.. విరుచుకుప‌డింది. తెలుగు వారి గుండెల్లోంచి ఎన్టీఆర్ పేరు తీసేయ‌డం.. ఎవ‌రికీ సాధ్యం కాద‌నిపేర్కొంది. ఎన్టీఆర్ యూనివ ర్సిటీకి.. తిరిగి ఆ పేరే పెట్టాల‌నేడిమాండ్ వ‌చ్చింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వం నుంచి దీనిపై సానుకూల నిర్ణ‌యం రాక‌పోగా.. మ‌రోసారి.. మం త్రుల నుంచి నేత‌ల వ‌ర‌కు అంద‌రూ కూడా.. ఎదురుదాడి చేశారు. పేరుమారిస్తే.. బాధ‌ప‌డుతున్న‌వారు.. ఆరోజు.. అన్న‌గారు కంట‌త‌డి పెట్టిన‌ప్పుడు ఏం చేశారంటూ.. ఎదురు ప్ర‌శ్నించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రో యుద్ధానికి వైసీపీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. వైఎస్ హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఆయ‌న పేరు పెట్టారు.

'ఇందిరా సాగ‌ర్ పోల‌వ‌రం ప్రాజెక్టు' అని.. వైఎస్ దీనికి పేరు పెట్టారు. అయితే.. రాష్ట్ర విభ‌జన త‌ర్వాత‌.. చాలా ఏళ్ల‌కు.. న‌వ్యాంధ్ర‌లో కొలుదీరిన‌.. చంద్ర‌బాబు స‌ర్కారు.. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఈ ప్రాజెక్టు పేరు మార్చేసింది. దీనికి ఎవ‌రిపేరో పెట్ట‌లేదు. కేవ‌లం 'ఇందిర‌' అన్న ప‌దం తొల‌గించి.. "పోల‌వ‌రం ఇరిగేష‌న్ ప్రాజెక్టు" అని మాత్ర‌మే పేరు పెట్టింది. దీనినే ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం వెలుగులోకి తెచ్చింది. ఏకంగా జీవోనే జారీ చేసింది.

"సంస్థ‌ల‌కు మ‌హ‌నీయుల పేర్లు పెడితే.. వాటిని మార్చేందుకు మ‌న‌సు ఎలా వ‌చ్చింది" అన్న టీడీపీ నేత‌ల‌కు కౌంట‌ర్‌గానే ఈ పాత జీవోను.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం బ‌య‌ట‌కు తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. నాడు చంద్ర‌బాబు కూడా త‌క్కువ చేయ‌లేద‌నే సంకేతాలు పంపించే వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.