Begin typing your search above and press return to search.
మండలి కొత్త చైర్మన్ డిసైడ్.. ఆయనే!
By: Tupaki Desk | 4 Jun 2021 2:30 PM GMTఅధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత శాసనమండలిలో పూర్తి స్థాయి ఆధిక్యం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఏపీలో 151మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైఎస్ జగన్ శాసనమండలిలో మాత్రం సరిపడా ఎమ్మెల్సీల బలం పొందలేకపోయారు. దీంతో కీలకమైన మూడు రాజధానుల బిల్లుల నుంచి అనేక బిల్లులను ఆమోదం పొందలేకపోయారు. టీడీపీ నుంచి గెలిచిన షరీఫ్ అహ్మద్ శాసన మండలి చైర్మన్ గా ఉండడంతో ప్రభుత్వానికి బిల్లుల ఆమోదం కానకష్టమైంది. వైసీపీ సర్కార్ ముందరికాళ్లకు బంధం పడింది.
తాజాగా మండలి చైర్మన్ షరీఫ్ పదవీ విరమణ చేశారు. 2019 ఫిబ్రవరి 7న ఆయన చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీకే బలం ఉండడంతో ఆయన కొనసాగారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లు రద్దు విషయంలో చైర్మన్ తీరుపై సీఎం జగన్ సహా వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు షరీఫ్ పదవీ విరమణతో కొత్త చైర్మన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ కొత్త మండలి చైర్మన్ విషయంలో ఎంపిక కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.
తాజాగా మే 31తో షరీఫ్ తోపాటు బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన డీసీ గోవిందరెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తర్వాత మాత్రమేఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇక ఈ మూడు ఖాళీ ఎమ్మెల్సీ సీట్లతోపాటు ఈనెల 18న స్థానికసంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు ఖాళీలు కానున్నాయి. అందులో ఏడు సీట్లు టీడీపీవీ కాగా.. వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. నామినేటెడ్ కోటాలో టీడీపీ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి ఒకరు రిటైర్ అవుతున్నారు. దీంతో శాసనమండలిలో టీడీపీ బలం 58 స్థానాలకు గాను 15 స్థానాలకు పడిపోతుంది. ఇక వైసీపీకే ఈ సీట్లు దక్కి బలం పుంజుకుంటుంది.
శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తోపాటు వైసీపీ మండలి సభా నాయకుడి పోస్టును జగన్ భర్తీ చేయనున్నారు. మండలి చైర్మన్ గా ముస్లిం వర్గానికే చెందిన రాయలసీమ మైనార్టీ నేత హిందూపురం నాయకుడు ఇక్బాల్ నుచేయడానికి సీఎం జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. గత 2019 ఎన్నికల్లో ఈయన హిందూపురం నుంచి పోటీచేసి బాలక్రిష్ణ చేతిలో ఓడిపోయారు. అయినా జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు.
ఇక డిప్యూటీ చైర్మన్ గా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా క్రిష్ణమూర్తిని దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇక మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా సీనియర్ నేత ఉమ్మారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన కాదంటే సి.రామంచంద్రయ్యకు ఆ స్థానం దక్కే అవకాశాలున్నాయంటున్నారు.