Begin typing your search above and press return to search.
అఖిలప్రియకు ఇంటిపోరు.?
By: Tupaki Desk | 20 July 2019 1:30 AM GMTకర్నూలు జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. అక్కడ పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువ. అనుచరులు నేతలంటే ప్రాణం ఇస్తారు. అయితే సుధీర్ఘ కాలం కర్నూలులో రాజకీయం నెరిపిన భూమా ఫ్యామిలీ ఓడిపోవడంతో ఇప్పుడు వారి అనుచరులు తట్టుకోవడం లేదు.
భూమా నాగిరెడ్డి మరణం తర్వాత వారి కూతురు అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చురుకుగా వ్యవహరించారు. నంద్యాలలో ఆమె సోదరుడిని కూడా గెలిపించి బలం చాటారు. అయితే ఇప్పుడు ఓడిపోవడంతో భూమా వర్గానికి.. బంధువులకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందట.. కొన్ని నెలల పాటు అది కొనసాగింది. ఇది కాస్తా కుటుంబం చీలికకు దారితీసిందట.. ఇప్పుడు పరిస్థితి అత్యంత అభిమానించే వారు కూడా భూమా అఖిల ప్రియ కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఎదురైందట..
భూమా అఖిలప్రియ, భార్గవ్ రావును పెళ్లి చేసుకున్నాక వీరి కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం. అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందట.. పైగా వీరి ప్రత్యర్థులు గంగుల ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీ తరుఫున గెలవడంతో వారంతా అటువైపే చూస్తున్నట్టు సమాచారం.
తాజాగా అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్నినిలబెట్టేందుకు భూమా అకిలప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డిని.. అఖిలప్రియకు సోదరుడు అయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు. కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా ఫ్యామిలీని నిలబెట్టేందుకు యోచిస్తున్నారట.. అందరూ కలిసి భూమా అఖిలప్రియ స్థానంలో బలమైన భూమా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కిషోర్ కుమార్ ను తెరపైకి తీసుకొచ్చి బీజేపీలో చేరి లీడ్ చేయాలని చూస్తున్నారు. అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భావిస్తున్నాడట.. మరి ఈ పరిణామాలు అఖిలప్రియకు షాకింగ్ లా మారాయని అంటున్నారు.