Begin typing your search above and press return to search.

నూతన పార్లమెంట్ భవనం అందాలు చూడతరమా..!

By:  Tupaki Desk   |   20 Jan 2023 6:35 AM GMT
నూతన పార్లమెంట్ భవనం అందాలు చూడతరమా..!
X
నూతనంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం(సెంట్రల్ విస్టా) పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంట్ భవనం కోసం ప్రస్తుతం తుది రంగులు దిద్దుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కేంద్రం అధికారిక వైబ్ సైట్లో పొందిపర్చింది.

విశాలమైన భవనంలో ఆకర్షణీయ కళాఖండాలతో ఉన్న గదులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివిధ దశల్లో తీసిన ఫోటోలను సెంట్రల్ విస్టా అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు.

నిజానికి సెంట్రల్ విస్టా నిర్మాణం 2022 నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు.. అనివార్య కారణాలతో భవన నిర్మాణ పనులు ఆలస్యమవుతూ వస్తున్నాయి.

2023 జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భవనం తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు సెంట్రల్ విస్టాలో జరుగుతాయా? లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా కొత్త పార్లమెంట్ భవనం సుమారు 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండనుంది. త్రిభుజాకార ఆకారంలో అన్ని హంగులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ బాధ్యతలను కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే కొన్ని రోజులుగా సెంట్రల్ విస్టా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పునరాభివృద్ధిలో భాగంగా మూడుకిలోమీటర్ల రాజ్‌పాత్‌ను రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు పునరుద్ధరించడం.. ఒక సాధారణ కేంద్ర సచివాలయం.. ప్రధానమంత్రి.. ఉప రాష్ట్రపతి ఎన్‌క్లేవ్ యొక్క నివాసాలు తదితర నివాసాలన్నీ కూడా కూడా ప్రాజెక్టులో భాగం కానున్నాయి. వీటి నిర్మాణాలను కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.