Begin typing your search above and press return to search.
అదంతా మార్ఫింగ్ మాయాజాలం.. ది న్యూయార్క్ టైమ్స్ వివరణ
By: Tupaki Desk | 30 Sep 2021 5:30 AM GMTలేనివి ఉన్నట్లుగా.. అబద్ధాల్ని అందమైన నిజాలుగా చెప్పటంలో కొందరు దిట్టగా ఉంటారు. అలాంటి వారు చేసే పనులు చూస్తే షాక్ తినాల్సిందే. అభిమానంతో చేశారో.. లేదంటే మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్న కుట్రతో చేశారో కానీ.. గడిచిన మూడు నాలుగు రోజుల క్రితం ఒక పిక్ వైరల్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేసినట్లుగా ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని అచ్చేసినట్లుగా పేర్కొంటూ.. అందుకు తగ్గట్లు ఒక ఫోటో వైరల్ గా మారింది.
చూసినంతనే.. అసలు అలాంటి హెడ్డింగులతో కథనాన్ని అచ్చు వేసే అవకాశమే న్యూయార్క్ టైమ్స కు లేనప్పటికీ.. అలా ఎందుకు వేస్తారు? అందునా అలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు అన్న అనుమానం వ్యక్తమైంది. ఇంతకీ ఆ వైరల్ ఫోటోలో.. ‘ది న్యూయార్క్ టైమ్స్’ మొదటి పేజీని అచ్చుగుద్దినట్లుగా దించేసి.. అందులో ప్రధాన కథనంగా 'LAST, BEST HOPE OF EARTHY" (ఈ భూమికి చివరి.. అత్యుత్తమ ఆశ) అనే హెడ్ లైన్ తో ప్రదాని మోడీ ఫోటోను బారీగా పెట్టి ఫ్రంట్ పేజీలో ఒక స్పెషల్ స్టోరీని అచ్చేసినట్లుగా ఒక మార్ఫింగ్ ఫోటోను తయారు చేశారు.
దాన్ని సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లోకి దించేశారు. దీనిపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమైంది. చివరకు ఈ మార్ఫింగ్ ఫోటో మీద న్యూయార్కు టైమ్స్ స్పదించింది. తాము ఆ తరహా వార్తను రాయలేదని.. అది పూర్తిగా ఎడిట్ చేసిన ఇమేజ్ అంటూ స్పష్టత ఇచ్చింది. దీంతో.. ఈ ఉదంతం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మోడీని ఇంతలా ఆకాశానికి ఎత్తేయటం వెనుక అభిమానమా? కుట్రనా? అన్నది మాత్రం తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. మరేం జరగుతుందో చూడాలి.