Begin typing your search above and press return to search.

ఇండియన్‌ మార్కెట్ లో సరికొత్త మొబైల్స్‌ సందడి

By:  Tupaki Desk   |   10 Nov 2021 1:30 AM GMT
ఇండియన్‌ మార్కెట్ లో సరికొత్త మొబైల్స్‌ సందడి
X
ఇది టెక్ ప్రపంచం.. ఇందులో రోజుకో రకమైన ఫీచర్లతో గ్యాడ్జెట్స్ కనువిందు చేస్తుంటాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా తయారీ సంస్థలు వివిధ రకాలైన గ్యాడ్జెట్స్ లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికే గత పది నెలలుగా వివిధ రకాలైన ఫీచర్లతో మార్కెట్లో సందడి చేశాయి. మిగతా గ్యాడ్జెట్లు ఎలా ఉన్న ఫోన్ల విషయంలో కంపెనీలు చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. దీనికి కారణం ఒక్కటే.. మార్కెట్లో నెలకొన్న పోటీ. ఈ కారణంగానే వివిధ రకాలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని వందల రకాల మోడళ్లను అందుబాటు లోకి తెచ్చాయి. ఇదిలా ఉంటే ఈ నెలలో మరింత కిక్కించే ఫోన్లను మరిన్ని హంగులు దిద్ది మార్కెట్ లోకి తీసుకురానున్నాయి. అయితే ఈ నెలలో విపణిలో సందడి చేయనున్న కొత్త మొబైల్ ఫోన్ల గురించి, వాటి ప్రత్యేకతల గురించి, వాటిలో విశేషంగా ఆకట్టుకునే అంశాల గురించి మనం కూడా ఓ లుక్కేద్దాం.

నవంబర్ నెలలో ఆసుస్ సరికొత్త ఫోన్ ను మార్కెట్లో కి తీసుకురానుంది. మంచి హై ఎండ్ పర్ఫామెన్స్ తో ఈ ఫోన్ విపణిలో కి అడుగు పెట్టనుంది. ఆసుస్ 8జెడ్ పేరుతో మార్కెట్లో సందడి చేయనున్న ఈ ఫోన్ ధర కూడా భారీగానే ఉంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 62 వేలకు పైగా పలకనుంది. దీనిని సంస్థ ప్రతినిధులు నెలాఖరులో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిలో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఈ ఫోన్ లు ప్రత్యేక హంగులుగా నిలవనున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇందులో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్888 ప్రాసెసర్ ఇందులో తీసుకొస్తున్నారు.

ఈ నెలలో రెడ్ మీ నుంచి కూడా మూడు మొబైల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. రెడ్ మీ అంటే ఆసక్తికనబరిచే వారి ఈ ఫోన్లు మంచి విజువల్ ఫీస్ట్ గా ఉండనున్నాయి. ఈ మూడు ఫోన్లు ఈ నెల చివరిలో మార్కెట్లో అడుగుపెట్టవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. వీటిలో ధరలు రూ. 14 వేల నుంచి రూ. 26 వేల వరకు ఉండొచ్చని టెక్కీలు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే పలు సిరీస్ లలో మొబైల్ ను తీసుకువచ్చిన రెడ్ మీ... ఈ ఫోన్లను రెడ్ మీ నోట్ 11 సిరీస్ లలో తీసుకురాబోతుంది. రెడ్ మీ నోట్ 11, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ అనే పేర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి.

ఈ ఫోన్లను ఇప్పటికే వారి దేశమైన్ చైనాలో విడుదల చేసింది ఆ సంస్థ. ఈ ఫోన్లు అన్నీ 5జీ సాంకేతికతతో రూపొందించినవిగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిలో బ్యాటరీ ప్రత్యేకం కానుంది. సుమారు 5000 ఎంఏహెచ్ తో ఈ బ్యాటరీ రానుంది. దీనికి మద్దతుగా 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.కేవలం ఇవే కాకా షియోమీ నుంచి 11 సిరీస్ లో షియోమీ 11టీ పేరుతో స్మార్ట్ ఫోన్ రానుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,120 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. వీటితో పాటు వన్ ప్లస్ 9 సిరిస్ లో ఓ ఫోన్, పోకో నుంచి ఎం సిరీస్ లో మరో ఫోన్, ఐకూ నుంచి మరో కొత్త మొబైల్, జియో ఫోన్ నెక్స్ట్ పేరుతో మరో ఫోన్ మార్కెట్ లోకి రావచ్చని చెప్తున్నారు టెక్కీలు.