Begin typing your search above and press return to search.

55ఏళ్ల కామాంధుడితో ర‌గులుతున్న దాచేప‌ల్లి!

By:  Tupaki Desk   |   3 May 2018 8:02 AM GMT
55ఏళ్ల కామాంధుడితో ర‌గులుతున్న దాచేప‌ల్లి!
X
మ‌గాళ్లు.. మృగాళ్లుగా మార‌టం.. మృగాలు సైతం సిగ్గుప‌డే ప‌నులు చేయ‌టం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా దారుణ ఘ‌ట‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది గుంటూరు జిల్లా దాచేప‌ల్లి. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిని 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేసిన వైనం ఇప్పుడు దాచేప‌ల్లిని ఉద్రిక్త‌త‌తో ఊగిపోయేలా చేస్తోంది.

చాక్లెట్ కొనిస్తాన‌ని చెప్పి.. అత్యాచారం చేసిన వైనంపై దాచేప‌ల్లి వాసులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఉదంతం దాచేప‌ల్లిలో నిర‌స‌న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఒక వ‌ర్గానికి చెందిన వారు రోడ్ల మీద‌కు వ‌చ్చి.. రోడ్ల మీద టైర్లు త‌గ‌ల‌బెట్టి నిర‌స‌న చేప‌ట్టారు.

కామాంధుడు సుబ్బ‌య్య‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేయ‌టంతో పాటు.. ఇలాంటి ఉదంతాలు మ‌ళ్లీ చోటు చేసుకోకుండా జాగ్ర‌గ్త‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. దాచేప‌ల్లికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి త‌న ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సుబ్బ‌య్య మాయ‌మాట‌లు చెప్పి.. చాక్లెట్ ఇప్పిస్తాన‌ని చేసి లైంగిక అత్యాచారం చేశారు. త‌ల్లిదండ్రుల‌కు చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని.. అనంత‌రం బాలిక‌ను ఇంటి ద‌గ్గ‌ర దింపి వెళ్లిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు.

త‌న‌కు తీవ్ర‌మైన క‌డుపునొప్పి అని బాలిక రోదించ‌టంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లిన త‌ల్లిదండ్రుల‌కు జ‌రిగింది తెలిసి నిర్ఘాంత‌పోయారు. పాప ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. తాను చేసిన ఆరాచ‌కం బ‌య‌ట‌కు పొక్క‌టంతో సుబ్బ‌య్య దాచేప‌ల్లి నుంచి పారిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. పాప‌కు మెరుగైన వైద్యం కోసం గుర‌జాల‌కు త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలిక‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ప‌రామ‌ర్శించారు.క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. బాలిక ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని.. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ ఉదంతం దాచేప‌ల్లిలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనేలా చేసింది.