Begin typing your search above and press return to search.
జీహెచ్ఎంసీ: ముగిసిన నామినేషన్లు.. 26మంది సిట్టింగ్ ల మార్పు
By: Tupaki Desk | 20 Nov 2020 5:30 PM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. విశేషం ఏంటంటే అన్ని స్థానాలకు టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
అధికార టీఆర్ఎస్ పార్టీ 26మంది సిట్టింగ్ లను మార్చి కొత్త వారికి టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ ఓవరాల్ గా 150 డివిజన్లకు 129మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 69 డివిజన్లలో అసలు అభ్యర్థులనే ప్రకటించకపోవడం విశేషం.
రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ పత్రాలు దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కనివారిని చేరదీసి కొన్ని పార్టీలు టికెట్లు ఇచ్చాయి.