Begin typing your search above and press return to search.

నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందట .. ఇండియాకు మ‌రో 'టీకా'

By:  Tupaki Desk   |   15 Jun 2021 7:30 AM GMT
నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందట .. ఇండియాకు మ‌రో టీకా
X
'నోవావాక్స్' కరోనా వైరస్ వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్రకటించింది. కరోనా అన్ని ర‌కాల వేరియంట్ల‌పై త‌మ టీకా ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా, మెక్సికోలో జ‌రిగిన భారీ స్థాయి అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డైన‌ట్లు నోవావాక్స్ ప్రకటించింది. ప్రాథ‌మిక డేటా ఆధారంగా వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్థ‌వంత‌మైంద‌ని, సుర‌క్షితంగా కూడా ఉన్న‌ట్లు నోవావాక్స్ చెప్పింది. నిజానికి అమెరికాలో కోవిడ్ టీకాల‌కు డిమాండ్ త‌గ్గింది. కానీ ప్ర‌పంచ దేశాల్లో ఆ టీకాల కోసం ఎదురుచూస్తున్నారు.

నోవావాక్స్ టీకాల‌ను సులువుగా నిల్వ చేయ‌వ‌చ్చు. ట్రాన్స్‌ పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. ప్ర‌పంచ దేశాల్లో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా డిమాండ్‌ ను అందుకోవ‌డంలో నోవావాక్స్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ఆ కంపెనీ చెప్పింది. సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి అమెరికా, యూరోప్‌, ఇత‌ర దేశాల్లోనూ త‌మ టీకాల‌కు అనుమ‌తి ద‌క్క‌నున్న‌ట్లు నోవావాక్స్ తెలిపింది. నెల‌కు 10 కోట్ల టీకాల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఆ కంపెనీకి ఉన్న‌ది. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి దేశాల‌కు తొలుత త‌మ టీకాలు వెళ్తాయ‌ని నోవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లే ఎర్క్ తెలిపారు. 18 ఏళ్లు దాటిన సుమారు 30 వేల మందిపై నోవావాక్స్ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. వీటిల్లో మూడ‌వ వంతు ప్ర‌జ‌లు మూడు వారాల వ్య‌వ‌ధిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.

ఇండియాలో కొవ‌వ్యాక్స్ పేరుతో ఈ టీకాను అందుబాటులోకి తీసుకున్నార‌ట . దీన్ని సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్టుగా స‌మాచారం. ఈ వ్యాక్సిన్ సెప్టెంబ‌ర్ క‌ల్లా అందుబాటులోకి రానున్న‌ద‌ని, ఈ ఏడాది చివ‌ర‌కు 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.ఫైజ‌ర్, మోడెర్నాల‌కు ధీటుగా ప‌ని చేస్తుంద‌ట ఈ వ్యాక్సిన్. ఇదిలా ఉంటే .. ప్రస్తుతం దేశంలో కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్, స్ఫూత్నిక్ వంటి వ్యాక్సిన్లు ఉన్నాయి. అయితే , వీటి ప్రొడ‌క్టివిటీ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. ఇప్ప‌టికైతే దేశంలో రెండో డోసుల వ్యాక్సినేష‌న్ పొందిన జ‌నాభా చాలా చాలా త‌క్కువ‌గానే ఉంది. క‌నీసం ఐదు శాతాన్ని కూడా మించ‌లేదు. అయితే ఒక డోసు వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారి సంఖ్య మాత్రం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ బేస్డ్ మ‌రో దేశీయ వ్యాక్సిన్ పై కేంద్రం ఆశ‌లు పెట్టుకుంది. బ‌యోలాజికల్-ఇ వ్యాక్సిన్ దాదాపు ముప్పై కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయంటున్నారు.