Begin typing your search above and press return to search.
పనిమనిషికి ముద్దు పెట్టిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే!
By: Tupaki Desk | 25 Dec 2022 2:30 AM GMTఇల్లు లేదు.. ఆఫీసు లేదు.. ఎక్కడైనా తన ఇష్టమేనని అనుకున్నాడేమో.. ఆ అధికారి.. ఏకంగా ఆఫీస్‌లో పనిచేసే స్వీపర్‌ను వాటేసుకుని ముద్దుల వర్షం కురిపించాడు. మరి ఆమె ఊరుకుంటుందా.. కేసు పెట్టింది. దీంతో సదరు అధికారి ఇప్పుడు ముద్దు పెట్టిన నేరానికి జైలుపాలయ్యాడు.
ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పని చేసే ఓ పనిమనిషిని బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన తమిళనాడులో జరిగింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని నుంగంబాక్కంలో ఉన్న ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అన్నానగర్‌కు చెందిన రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్టన్(36) సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కార్యాలయంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ.. గత ఐదేళ్లుగా పనిమనిషిగా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతంగా ముద్దు పెట్టాడు. అతడు ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు.
దీంతో రోక్స్ తనను లైంగికంగా వేధించాడని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అతడు చాలా సార్లు లైంగికంగా వేధించాడని చెప్పింది. ఫోన్ చేసి తనను నిరంతరం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 14న గదిని శుభ్రం చేయడానికి పిలిచాడని.. వెళ్లి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా తనను కౌగిలించుకుని ముద్దు పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. అతడి వేధింపులు భరించలేక 15 తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ రోక్స్ను అరెస్ట్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.