Begin typing your search above and press return to search.

సిద్ధూని వదలని పాత కేసు ?

By:  Tupaki Desk   |   26 Feb 2022 4:33 AM GMT
సిద్ధూని వదలని పాత కేసు ?
X
అప్పుడెప్పుడో ముగిసిపోయిన పాత కేసొకటి మళ్ళీ నవ్ జోత్ సింగ్ సిద్ధూ మెడకు చుట్టుకుంది. బాధిత కుటుంబం సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ కారణంగా సిద్ధూ సుప్రంకోర్టు మెట్లెక్కాల్సొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే 1998లో సిద్ధూకి 65 ఏళ్ళ వయస్సున సీనియర్ సిటిజన్ గున్నామ్ సింగ్ కు మధ్య గొడవైంది. తన వాహనానికి దారి ఇవ్వలేదన్న కోపంతో సిద్ధు గుర్నామ్ సింగ్ పై దాడి చేశాడు. పెద్దాయన్ను పట్టుకుని చితకొట్టాడు.

సిద్ధూ కొట్టిన దెబ్బలకు గుర్నామ్ ఆసుపత్రిలోనే చాలా రోజులుండాల్సొచ్చింది. చివరకు చికిత్స తీసుకుంటునే గుర్నామ్ చనిపోయారు. దాంతో బాధిత కుటుంబం సిద్ధూపై కేసు పెట్టింది. ఆ కేసుపై కోర్టులో చాలా సంవత్సరాలు సిద్ధూ పోరాటం చేశాడు. చివరకు ఒక వ్యక్తి మరణానికి కారకుడని తేల్చిన కోర్టు సిద్ధూకి 3 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. పాఠియాల కోర్టు తీర్పును సిద్ధూ సుప్రింకోర్టులో చాలెంజ్ చేశారు. దాంతో మళ్ళీ కేసును విచారించిన సుప్రింకోర్టు 3 జైలుశిక్షన రద్దుచేసింది.

సీనియర్ సిటిజన్ను గాయపరిచినందకు 2018లో సుప్రింకోర్టు వెయ్యి రూపాయల జరిమాన వేసి సిద్ధూని వదిలేసింది. తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన బాధిత కుటుంబం మళ్ళీ సుప్రింకోర్టులో రివ్యు పిటీషన్ వేసింది. తమ తండ్రి మరణానికి కారకుడైన సిద్ధూకి కఠిన శిక్ష విధించాల్సిందేనంటు అభ్యర్ధించింది. దాంతో సుప్రింకోర్టు సిద్ధూకి నోటీసులు జారీచేసింది. శుక్రవారం కోర్టులో జరిగిన విచారణలో సిద్ధూ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వాదనలు వినిపించారు. మరి ఈసారి సుప్రింకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి.