Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 'మ్యాన్ ఆఫ్ ది హోల్' ఇక లేడు

By:  Tupaki Desk   |   30 Aug 2022 1:30 AM GMT
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు
X
బ్రెజిల్ లోని దట్టమైన అమెజాన్ అడవుల్లో 25 ఏళ్లుగా ఓ ఒంటరి మనిషి జీవిస్తున్నాడు. అతడిని అంతా ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’ అని పిలుస్తారు. పేరు, ఏ తెగకు చెందిన వాడన్నది స్పష్టత లేదు. 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం గుర్తించి ఫాలో అయ్యింది. 2011 మార్చి 19న అతడి వీడియోను తీశారు. చెట్లను నరుకుతూ కనిపిస్తూ అర్ధనగ్నంగా బట్టలు లేకుండా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించలేదు. దూరం నుంచి వీడియో తీశారు. చాలా కాలం వెంబడించాక అతడి ముఖం కెమెరాకు చిక్కింది.

ఎవరైనా అతడిని చూసినా.. దగ్గరికి వెళ్లినా బాణాలు, ఈటలతో దాడి చేసేవాడు. అడవిలో ఉచ్చులు పన్ని అందులో వేసి చంపేవాడు.1970 నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదావాసీ తెగలకు చెందిన వాడే ఈ అజ్ఞాత వ్యక్తి అని చర్చ నడుస్తోంది. మనుషులపై కోపంతోనే కనిపించిన వారినల్లా చంపాడని సమాచారం. జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునేవాడని.. అక్కడొక గుడిసె వేసుకొని కొన్నాళ్ల పాటు జీవించాడని సమాచారం.

బ్రెజిల్ లోని అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో 30కి పైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. 2003లో పాస్ట్రోల్ యాక్ట్ కింద బ్రెజిల్ ద్వారాలు తెరవడంతో భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. భూస్వాములు అక్కడి అడవులపై పడి తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. ఆ తెగకు చెందిన వ్యక్తియే అయ్యి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం తెలిపింది.

ఎవరైనా ఆహారం సాయం చేసినా ఎవరినీ నమ్మేవాడు కాదు ఇతడు. వాటిని ఛీదరించుకొని మరీ దూరంగా వెళుతూ దాడులు చేసేవాడు. 80వ దశకంలో ఆదావాసీలకు సాయం పేరిట చక్కెరలో, పప్పుల్లో ఎలుకల మంది కలిపి చంపిన చరిత్ర ఉంది. అమెజాన్ పట్ల అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆదివాసీలపై దాడులతో ప్రకృతిని నాశనం చేస్తూ అక్కడి బ్రెజిల్ అధ్యక్షుడు పరిపాలిస్తున్నాడు. ఆదివాసీ తెగలను తెగనరుకుతున్నాడన్న ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ చనిపోయాడని.. కూలిపోయిన స్థితిలో ఉన్న ఓ పాకలో ఆగస్టు 23న అతడి మృతదేహం కనిపించినట్టు తెలిసింది. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నాగరికత ఎంతో ఎదిగిన ఈ సమయంలో ఒక మనిషి ఇలా ఆదిమ మానవుడిగా బతకడం వింతే. మనుషుల ధనదాహానికే అతడు ఇలా మారాడని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.