Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల‌కు మెదులుతున్న ఒకే ఒక ప్ర‌శ్న‌.. ఏంటంటే!

By:  Tupaki Desk   |   21 April 2021 8:30 AM GMT
టీడీపీ నేత‌ల‌కు మెదులుతున్న ఒకే ఒక ప్ర‌శ్న‌.. ఏంటంటే!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీలో ఇప్పుడు ఒక ప్ర‌శ్న హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదికూడా అత్యంత కీల‌క‌మైన వ‌చ్చే ఎన్నిక‌ల గురించే. స‌రే.. ఆ విష‌యంలోకి వెళ్లేముందు.. ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డును చూద్దాం. త‌మిళ‌నాడులో ఎంజీఆర్ పార్టీ త‌ర్వాత‌.. ఏపీలో టీడీపీనే ప్రాంతీయ పార్టీల్లో అత్యంత కీల‌క‌మైంది. ఇటీవ‌లే 40వ వ‌సంతాన్ని సైతం పార్టీ నేత‌లు ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. అయితే.. ఇప్పుడు అదే పార్టీలో ఇబ్బంది ఏర్ప‌డింది. ముఖ్యంగా నాయ‌కులు చురుగ్గా లేక‌పోవ‌డం పార్టీని ప‌ట్టి వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయితే.. సీనియ‌ర్లు, ప్ర‌జ‌ల్లో స‌త్తా కోల్పోయిన‌వారు. కురువృద్ధులు మాత్రం పార్టీని ప‌ట్టుకుని వేలాడుతుం డ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇలాంటి వారిని ఇప్పుడున్న ఓట‌ర్ల‌లో 46 శాతం మంది గర్తుపెట్టే ప‌ర‌స్థితి కూడా లేదు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత చంద్ర‌బాబు యువ నాయ‌కుల‌ను త‌యారు చేయాల‌ని, రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. అయితే.. సీనియ‌ర్లు మాత్రం ఈ ప్ర‌తిపాద‌న ఇలా తెర‌మీదికి రాగానే అలా అలుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నేత‌ల‌ను ఒక ప్ర‌ధాన ప్ర‌శ్న వేధిస్తోంది. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది. అయితే.. ఎన్నిక‌ల నాటికి.. ఇవేవీ కాకుండా.. డ‌బ్బు పంచ‌డం అనేదే ప్ర‌ధానంగా మారుతుంద‌ని అంటున్నారు.

దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లే.. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ.. స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌లు. పంచాయ‌తీ ఎన్ని క‌ల్లో 85-90 శాతం పోలింగ్ జ‌రిగింది. ఇక‌, స్థానికంలోనూ ఇలానే ఓటింగ్ జ‌రిగింది. ఈ రెండు ఎన్నిక ‌ల్లోనూ ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచారు. అయితే.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను బాయ్‌కాట్ చేయ‌డంతో .. వైసీపీ ఎవ‌రికీ డ‌బ్బులు పంచ‌లేదు. ఇక‌, బీజేపీ-జ‌న‌సేన కూట‌మి.. మాత్ర‌మే పోటీ లో ఉండ‌డంతో వారు ఎలాగూ డ‌బ్బులు పంచ‌రు క‌నుక వైసీపీ కూడా ప్ర‌ధాన పోటీ ఉండ‌దు.. అనుకుని ఓట‌ర్ల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం ఘోరంగా దెబ్బ‌తింది.

పంచాయ‌తీ, స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో క్యూక‌ట్టుకుని మ‌రీ ఓట్లు వేసిన ప్ర‌జ‌లు.. ప‌రిష‌త్‌కు వ‌చ్చేస‌రికి మాత్రం ముందుకు రాలేదు. అంటే.. దీనిని బ‌ట్టి.. రాబోయే 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా డబ్బుదే ప్ర‌ధాన పాత్ర కానుంది. ఇదే విష‌యం ఇప్పుడు టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి పెద్ద ఎత్తున డ‌బ్బులు పంచాలి. దీనికి సంబంధించి.. పార్టీ కూడా ఎమ్మెల్యే అభ్య‌ర్థికి కొంత డ‌బ్బు ఇస్తేనే త‌ప్ప‌.. వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏం చేస్తారు? ఎన్నిక‌ల నాటికి మాకు డ‌బ్బులు స‌మ‌కూర్చుతారా? లేదా? అనే ప్ర‌శ్న‌లు టీడీపీ నేత‌ల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో వీటికి స‌మాధానం ల‌భించ‌డం లేదు. దీంతో నాయ‌కులు చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా తూతూ మంత్రంగా వ‌చ్చి పోతున్నారు. ఇక‌... వైసీపీ ప‌రిస్థితి తీసుకుంటే.. ఆర్థికంగా నాయ‌కులు బ‌లోపేతం అవుతున్నారు. పార్టీ కూడా ఆర్థికంగా బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థులు ఓకే. కానీ, ఒక‌వైపు న‌వ‌ర‌త్నాలు.. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో డ‌బ్బులు భారీ ఎత్తున పంచేందుకు.. వైసీపీ నేత‌లు సిద్ధ‌మైన నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ ఏం చేస్తారు? ఆర్థికంగా న‌నేత‌ల‌ను బ‌లోపేతం చేస్తారా? లేక మ‌రో వ్యూహం ఏదైనా ఉందా? అనేది నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.