Begin typing your search above and press return to search.

కరోనా నుంచి రక్షణకు భూఆవరణలోని ఏకైక సురక్షిత స్థానం

By:  Tupaki Desk   |   19 March 2020 5:30 PM GMT
కరోనా నుంచి రక్షణకు భూఆవరణలోని ఏకైక సురక్షిత స్థానం
X
ఇందుగలదు అందులేదని సందేహం వలదు అన్నట్లుగా భూమ్మీద అడుగడుగునా వ్యాపిస్తున్న కరోనావైరస్ నుంచి రక్షించుకోవడం ఎలాగో తెలియక జనం భయపడుతున్నారు. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా కొందరు వైరస్ బారినపడుతుండడం... అన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ భూ ఆవరణలో సురక్షిత స్థానమే లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనికి నాసా సమాధానం చెప్పింది. భూఆవరణలో కరోనా వైరస్ ప్రవేశించలేని ఏకైక ప్రదేశం ఏదైనా ఉందంటే అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒక్కటేనని చెప్పింది.

ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుం చి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూమికి కాస్త ఎత్తులో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూ ఆవరణలోనే ఉంటుంది. 52 ఏళ్ల క్రితం ఈ స్టేషన్లోని ఒక ఆస్ట్రోనాట్ కు జలుబు చేసింది. అంతకుముందు కానీ ఆ తరువాత కానీ ఇందులో ఒక్కరికి కూడా ఎలాంటి వైరస్ సోకలేదు.ఈ కేంద్రం లో హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఇక్కడికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తారు. ఇక్కడికి తప్ప ఇంకెక్కడికైనా వైరస్ రావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.