Begin typing your search above and press return to search.
చికెన్ ముక్క తిన్నందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది
By: Tupaki Desk | 13 Jan 2020 4:18 AM GMTచిన్న చికెన్ ముక్క.. పదేళ్ల కుర్రాడి కి రెండు రోజుల పాటు నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించింది. వైద్యులు రంగప్రవేశంతో సమస్యకు సొల్యూషన్ లభించినా.. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించకుంటే.. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ లోని లింగంపల్లికి చెందిన పదేళ్ల బాలుడు భోజనం చేస్తున్న వేళ.. చికెన్ ముక్క ఎముక అతడి గొంతులో ఇరుక్కుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ కుర్రాడిని చివరకు కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
పిల్లాడ్ని పరీక్షించిన వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. తొలుత ఆహారనాళం లో ఇరుక్కున్న చికెన్ ఎముకను జాగ్రత్త గా తీశారు. అనంతరం ఏండోస్కోపిక్ ద్వారా ఆహారా నాళాన్ని క్లీన్ చేశారు. దీంతో.. ఇప్పుడు ఆహార నాళం బాగా పని చేస్తోంది. ఆహార నాళంలో ఏమైనా ఇరుక్కుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని.. అలానే ఉండి పోతే మరింత ప్రమాదానికి కారణమవుతుందని చెప్పారు. ఆహార నాళం లో ఫుడ్ ఇరుక్కు పోతే.. అత్యవసరంగా తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పంట్లో చిన్న పీచు ఇరుక్కుంటేనే.. కాలు చేయి ఆడదు. అలాంటిది చికెన్ ముక్క ఆహారనాళంలో ఇరుక్కుపోవటం.. రెండు రోజులు నరకాన్ని చూసిన వైనం వింటేనే చెమటలు పట్టేస్తాయి. ఏమైనా.. తినేటప్పుడు కాస్త జాగ్రత్త గా.. నెమ్మది గా తినాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.